అదుగో ‘ విక్రమ్ ‘ శకలాలు.. నాసా.. చెన్నై ఇంజనీరుకు ప్రశంసలు

మొత్తానికి విక్రమ్ లాండర్ శకలాల ఆచూకీ దొరికింది. చంద్రయాన్-2 కి సంబంధించిన విక్రమ్ లాండర్ శకలాలు చంద్రుని ఉపరితలంపై కనిపించాయట. జాబిల్లి కక్ష్యలో ఉన్న తమ శాటిలైట్ వాటిని కనుగొన్నట్టు నాసా ప్రకటించింది. ‘ మా ల్యూనార్ రికన్నాయిజెన్స్ ఆర్బిటర్ (ఎల్ ఆర్ ఓ ) వీటి ఇమేజీలను క్లికే చేసి పోస్ట్ చేసిందని నాసా పేర్కొంది. ఈ లాండర్ కూలిన చోట వాయువ్యంగా దాదాపు 750 కి.మీ. దూరంలో తొలి శకలాన్ని చెన్నైకి చెందిన షణ్ముగ […]

అదుగో ' విక్రమ్ ' శకలాలు.. నాసా.. చెన్నై ఇంజనీరుకు ప్రశంసలు
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 03, 2019 | 7:28 PM

మొత్తానికి విక్రమ్ లాండర్ శకలాల ఆచూకీ దొరికింది. చంద్రయాన్-2 కి సంబంధించిన విక్రమ్ లాండర్ శకలాలు చంద్రుని ఉపరితలంపై కనిపించాయట. జాబిల్లి కక్ష్యలో ఉన్న తమ శాటిలైట్ వాటిని కనుగొన్నట్టు నాసా ప్రకటించింది. ‘ మా ల్యూనార్ రికన్నాయిజెన్స్ ఆర్బిటర్ (ఎల్ ఆర్ ఓ ) వీటి ఇమేజీలను క్లికే చేసి పోస్ట్ చేసిందని నాసా పేర్కొంది. ఈ లాండర్ కూలిన చోట వాయువ్యంగా దాదాపు 750 కి.మీ. దూరంలో తొలి శకలాన్ని చెన్నైకి చెందిన షణ్ముగ సుబ్రహ్మణ్యన్ అనే ఇంజనీర్ కనుగొన్నాడని ఈ సంస్థ తెలిపింది. అనంతరం ఎల్ ఆర్ ఓ ప్రాజెక్టు బృందం ఇతర శకలాలను కూడా గుర్తించింది. అక్టోబర్ 14, 15, నవంబరు 11 తేదీల్లో ఈ చిత్రాలను తీసి పంపినట్టు నాసా పేర్కొంది. ఈ ఇమేజీల ప్రకారం .. నీలిరంగు చుక్కలు విక్రమ్ కూలిన కారణంగా ఏర్పడిన చంద్రుని ఉపరితలాన్ని, ఆకుపచ్చని రంగు చుక్కలు లాండర్ శకలాలను చూపుతున్నాయి. ‘ ఎస్ ‘ తో సూచించిన శకలం షణ్ముగ సుబ్రహ్మణ్యన్ కనిపెట్టిందని నాసా స్పష్టం చేసింది.

ఈ లాండర్ శకలాలు కనబడడానికి ముందు, ఆ తరువాత చంద్రుని ఉపరితలం ఎలా ఉందొ కూడా నాసా ఫోటోలను పంపింది. శకలాల ఐడెంటిఫికేషన్ విషయమై షణ్ముగ సుబ్రహ్మణ్యన్ ఎల్ ఆర్ ఓ ప్రాజెక్టు బృందానితో సంప్రదించారని, ఈ సమాచారం అందుకున్న టీమ్ ఆ తరువాతి ఇమేజీలను పోల్చి చూసిందని వెల్లడైంది. సెప్టెంబర్ 7 న చంద్రుని ఉపరితలంపై దిగాల్సిన ఈ మిషన్ విక్రమ్ లాండర్ చివరి క్షణాల్లో భూమితో కాంటాక్ట్ కోల్పోయింది. అప్పటినుంచి దాని జాడను కనుగొనేందుకు ఇస్రోతో బాటు నాసా కూడా పలు ప్రయత్నాలు చేస్తూ వస్తోంది.

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..