Namami Gange: నమామి గంగే చిహ్నంగా ‘చాచా చౌదరి’.. పిల్లలకు అవగాహన కల్పించడానికి ఎంపిక..

|

Oct 01, 2021 | 10:08 PM

Namami Gange: కేంద్ర ప్రభుత్వం గంగా నది పరిశుభ్రత కోసం నమామి గంగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ '

Namami Gange: నమామి గంగే చిహ్నంగా చాచా చౌదరి.. పిల్లలకు అవగాహన కల్పించడానికి ఎంపిక..
Chacha Chaudhary
Follow us on

Namami Gange: కేంద్ర ప్రభుత్వం గంగా నది పరిశుభ్రత కోసం నమామి గంగే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ‘చాచా చౌదరి’ని నమామి గంగే ప్రాజెక్ట్ చిహ్నంగా ఎంపిక చేసింది. పిల్లల్లో గంగా నది గురంచి అవగాహన కల్పంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (NMCG) 37 వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. కాగా ఈ సమావేశానికి NMCG డైరెక్టర్ జనరల్ రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షత వహించారు.

గంగానది గురించి అవగాహన కల్పించడానికి చాచా చౌదరికి సంబంధించిన కార్టూన్లు, యానిమేషన్ చిత్రాలు రూపొందిస్తారు. దీని కోసం నమామి గంగ మిషన్ డైమండ్ బుక్స్‌తో జతకట్టింది.13 మే 2015 న కేంద్ర మంత్రివర్గం గంగా నది, దాని ఉపనదుల పరిరక్షణ కోసం నమామి గంగే ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో గంగా నది పరిశుభ్రత కోసం ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.

మిషన్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు 15 సంవత్సరాల పాటు కొనసాగుతుందన్నారు. అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా బహుమతులను వేలం వేస్తానని ప్రకటించారు. వీటి ద్వారా వచ్చిన డబ్బును ఈ కార్యక్రమానికి కేటాయిస్తానని తెలిపారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కోసం రూ .11,842 కోట్లు ఖర్చు చేశారు.

Divi Vadthya : పచ్చని ఓణిలో పంచదార బొమ్మ.. ఈ బిగ్ బాస్ బ్యూటీ అందానికి ఫిదా కావాల్సిందే..

Huzurabad By Election: గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్.. ఈసీకి 20 మంది స్టార్ క్యాంపెయినర్స్ జాబితా

World Vegetarian Day 2021: శాకాహారులుగా మారితే 5 అద్భుత ప్రయోజనాలు..! ఏంటో తెలుసుకోండి..