SDRF Fund: రాష్ట్రాలకు ఎస్‌డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేసిన కేంద్రం.. కరోనా నివారణకు..

|

May 01, 2021 | 12:44 PM

SDRF instalment: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. రాష్ట్రాలకు రూ. 8,873.6 కోట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను కేంద్రం శనివారం

SDRF Fund: రాష్ట్రాలకు ఎస్‌డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేసిన కేంద్రం.. కరోనా నివారణకు..
Sdrf Instalment
Follow us on

SDRF instalment: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. రాష్ట్రాలకు రూ. 8,873.6 కోట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను కేంద్రం శనివారం విడుదల చేసింది. అయితే.. ఆయా రాష్ట్రాలకు విడుదల చేసిన మొత్తంలో 50 శాతం నిధులను కరోనా నివారణ చర్యలకు వాడుకోవచ్చని కేంద్రం అధికారికంగా వెల్లడించింది. కాగా.. కేంద్ర ప్రభుత్వం ఈ సారి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను ముందుగానే విడుదల చేసింది. సాధారణంగా ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫారసు మేరకు జూన్‌లో కేంద్రం విడుదలవుతాయి. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు అందించిన మొత్తానికి సంబంధించిన వినియోగ ధ్రువీకరణ పత్రం కోసం చూడకుండా.. 22 రాష్ట్రాలకు ఈ నిధులను కేంద్రం విడుదల చేసింది.

అయితే.. విడుదల చేసిన 8,873.6 కోట్ల నిధుల్లో.. 50శాతం రూ.4,436.8 కోట్లను కరోనా కట్టడికి రాష్ట్రాలు వినియోగించుకునే అవకాశం కల్పించింది. కరోనా కట్టడి కోసం వైద్య పరికరాలను సమకూర్చుకోవచ్చు. ఆసుపత్రుల్లో వెంటిలెటర్లు, ఎయిర్‌ ప్యూరీఫైయర్లు, అంబులెన్స్‌లు, కోవిడ్‌ ఆసుపత్రులు, కరోనా కేర్‌ సెంటర్లలో ఆక్సిజన్‌ సౌకర్యం, ఉత్పత్తి, నిల్వ ప్లాంట్ల ఖర్చులు తదితర అవసరాలకు వినియోగించుకోవచ్చని ఆర్థిక శాఖ ఉత్తర్వులను విడుదల చేసింది.

Also Read:

Oxygen Plant: ప్రాణవాయువు కొరత.. 50 గంటల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు.. రోజుకీ 100 సిలిండర్లు..

Corona Virus: కరోనా వైరస్ మీ శరీరంలోకి ప్రవేశించినట్లు లంగ్స్ ముందే అలెర్ట్ చేస్తాయంటున్న శాస్త్రజ్ఞులు.. ఎలా తెలుసుకోవాలంటే..!