Fact Check: వాట్సాప్ చాటింగ్ పర్యవేక్షణకు ఎటువంటి మార్గదర్శకాలు జారీచేయలేదు.. అసత్య ప్రచారాలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

|

Aug 22, 2022 | 10:20 PM

వాట్సప్ (WhatsApp) చాటింగ్ లను పర్యవేక్షించేందుకు కేంద్రప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారిచేసిందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న ప్రచారంపై కేంద్రప్రభుత్వం స్పందించింది. కేంద్ర సామాచర, ప్రసార శాఖకు చెందిన

Fact Check: వాట్సాప్ చాటింగ్ పర్యవేక్షణకు ఎటువంటి మార్గదర్శకాలు జారీచేయలేదు.. అసత్య ప్రచారాలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Whatsapp Feature
Follow us on

Fact Check: వాట్సప్ (WhatsApp) చాటింగ్ లను పర్యవేక్షించేందుకు కేంద్రప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారిచేసిందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న ప్రచారంపై కేంద్రప్రభుత్వం స్పందించింది. కేంద్ర సామాచర, ప్రసార శాఖకు చెందిన పత్రికా సమాచార కార్యాలయం-PIB ఈప్రచారానికి సంబంధించి స్పష్టతనిచ్చింది. పౌరుల వాట్సప్ చాటింగ్ లను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఎటువంటి మార్గదర్శకాలను విడుల చేయలేదని పిఐబి తన ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది చేస్తున్న అసత్యప్రచారమేనని కొట్టిపారేసింది. అటువంటి వాటిని ప్రజలు ఎవరూ నమ్మవద్దని పిఐబి సూచించింది.

వాట్సప్ మెసేజ్ లను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం నూతన మార్గర్శకాలు జారీచేసిందని, దాని ఆధారంగా ప్రజలపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరగుతోంది. వాట్సప్ లో మెసేజ్ పంపిస్తే ఒక టిక్ మార్కు, అవతలివారికి చేరితే రెండు టిక్ మార్క్ లు, 2 బ్లూ కలర్ టిక్ లు ఉంటే అవతలివారు మెసేజ్ చూశారని.. 3 బ్లూ టిక్ లు ఉండే ప్రభుత్వం ఆమెసేజ్ ను గమనించిందని అర్థమంటూ ప్రచారం జరుగుతోంది. రెండు బ్లూ, ఒక రెడ్ టిక్ ఉంటే ప్రభుత్వం మీపై చర్యలు తీసుకోనుందని, అదే ఒక బ్లూ, రెండు రెడ్ టిక్ లు ఉంటే సమాచారాన్ని ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని.. మూడు రెడ్ కలర్ టిక్ లు ఉంటే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిందని అర్ధం అంటూ సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వైరల్ అయింది. ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని పిఐబి స్పష్టత ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..