Petrol And Diesel Under GST: పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆకాశమే హద్దుగా పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.100 చేరువవుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలంటే మన దగ్గర ఉన్న ఏకైక అవకాశం ఇంధన ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడమే. ఇది గత కొద్ది రోజులుగా వినిపిస్తోన్న డిమాండ్. ఒకవేళ పెట్రోల్, డీజీల్ జీఎస్‌టీ పరిధిలోకి వస్తే లీటర్ పెట్రోల్ ధర రూ.70కి చేరువవుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకువచ్చేందుకు ఎంత సమయం పడుతుందో తెలుసా.? ఏకంగా 8 నుంచి 10 ఏళ్లు. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. బీజేపీకి చెందిన ఓ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలివి. ఇంధన ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుశీల్ కుమార్ మేదీ స్పష్టం చేశారు. ఒకవేళ జీఎస్‌టీ కిందకు వస్తే వార్షికంగా రూ.2 లక్షల కోట్ల మేర ఆదాయాన్ని రాష్ట్రాలు కోల్పోవాల్సి వస్తుందని.. ఇందుకు ఏ రాష్ట్రం కూడా సుముఖంగా లేదని ఆయన తెలిపారు. ఆర్థిక బిల్లుకు మద్దతుగా రాజ్యసభలో బుధవారం సుశీల్ మోదీ ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్రాలకు రూ.2 లక్షల కోట్ల నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలంటూ ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉంటే పెట్రోలియం ఉత్తత్పులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రూ.5 లక్షల కోట్ల మేర పన్నులు వసూలు చేస్తున్నాయని, జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే గరిష్ట రేటు అయిన 28 శాతమే పన్ను అమలవుతుందని.. ప్రస్తుతం అయితే వాటి విక్రయ ధరలో 60 శాతం వరకు పన్ను అమలవుతున్నట్టు సుశీల్ మోదీ తెలిపారు.
Also Read: AIADMK Party: శశికళ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన పన్నీర్ సెల్వం.. అన్నాడీఎంకేలో తీవ్ర కలకలం..