Online Games GST: ఆన్‌లైన్ గేమ్స్ నిర్వాహకులకు భారీ షాక్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..
Online Games GST: అంతా ఊహించినట్టే జరిగింది. కానీ, పర్సంటేజే ఊహించనివిధంగా ఉంది. ఆన్‌లైన్ గేమ్స్ నిర్వాహకులనే కాదు, ఆటగాళ్లకు
Online Games GST: అంతా ఊహించినట్టే జరిగింది. కానీ, పర్సంటేజే ఊహించనివిధంగా ఉంది. ఆన్‌లైన్ గేమ్స్ నిర్వాహకులనే కాదు, ఆటగాళ్లకు కూడా షాకివ్వబోతోంది జీఎస్టీ. ఆన్‌లైన్ గేమ్స్ నిర్వాహకులకు కేంద్రం భారీ షాకివ్వబోతోంది. ఊహించనివిధంగా GST విధించబోతోంది. 18 అనుకుంటే ఏకంగా 28శాతం GST ఇంప్లిమెంట్‌కు అడుగులు పడుతున్నాయ్. ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, రేస్ కోర్స్‌లపై 28 పర్సంటేజ్ GST విధించాలంటూ కేంద్ర మంత్రుల బృందం రిఫర్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. త్వరలోనే ఈ నివేదికను కేంద్రానికి సమర్పించనుంది కేబినెట్ కమిటీ. గుర్రపు పందేలు, క్యాసినో, ఆన్‌లైన్ గేమ్స్‌పై ఎంత GST విధించాలన్న అంశంపై మంత్రుల కమిటీ చర్చలు జరుపుతోంది.
ప్రస్తుతమున్న 18శాతం GSTనే కంటిన్యూ చేయాలని స్కిల్ గేమింగ్ నిర్వాహకులు కోరుతుండగా, 28శాతం సిఫార్సు చేసింది మంత్రుల కమిటీ. త్వరలో జరగనున్న GST మండలి మీటింగ్‌లో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. దాంతో, కమిటీ సిఫార్సులపై స్కిల్ గేమింగ్ సమాఖ్య ఆందోళన వ్యక్తంచేస్తోంది. 28శాతం GST విధిస్తే పరిశ్రమ మనుగడే డేంజర్‌లో పడుతుందని అంటోంది. సుమారు 50వేల మందికి ఉపాధి కల్పిస్తోన్న స్కిల్ గేమింగ్ పరిశ్రమకు ఇది భారంగా మారుతుందని చెబుతోంది. అధిక పన్ను పరిధిలోకి చేర్చడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతోంది. స్కిల్ గేమింగ్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. ఓవరాల్‌గా స్కిల్ గేమింగ్ ఇండస్ట్రీయే నష్టపోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం పన్ను ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. గ్యారంటీ, నమ్మకంలేని ఆపరేటర్ల చేతుల్లో చిక్కుకుని ఆటగాళ్లు నష్టపోయే అవకాశం ఉందంటున్నారు స్కిల్ గేమింగ్ నిర్వాహకులు.