Lalu Prasad Yadav: మరో స్కామ్‌లో లాలూ ప్రసాద్ యాదవ్.. భార్యా, కుమార్తె ఇళ్లు సహా 17 ప్రాంతాల్లో దాడులు..

|

May 20, 2022 | 12:18 PM

గతంలో ఆర్ఆర్‌బీ రిక్రూట్మెంట్ లో జరిగిన అవినీతి, అక్రమాలపై లాలూప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుమార్తెలపై సీబీఐ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.

Lalu Prasad Yadav: మరో స్కామ్‌లో లాలూ ప్రసాద్ యాదవ్.. భార్యా, కుమార్తె ఇళ్లు సహా 17 ప్రాంతాల్లో దాడులు..
Lalu Prasad Yadav
Follow us on

Lalu Prasad Yadav – Railway Job Scam: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ మరో స్కామ్‌లో చిక్కుకున్నారు. రైల్వే జాబ్స్ స్కాంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబ్బంది శుక్రవారం ఉదయాన్నే లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతీ నివాసాలతోపాటు ఢిల్లీ, బీహార్‌లోని పలు ప్రాంతాల్లో 17 చోట్ల (CBI Raids) దాడులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆర్ఆర్‌బీ రిక్రూట్మెంట్ లో జరిగిన అవినీతి, అక్రమాలపై లాలూప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుమార్తెలపై సీబీఐ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొంటున్నారు.. ఈ కేసు ప్రాథమిక విచారణలో అవినీతి జరిగినట్లు తేలడంతో సీబీఐ దాడులు నిర్వహిస్తోందని పేర్కొంటున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ 2004 నుంచి 2009 వరకు రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో జరిగిన రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలకు పాల్పడ్డారని.. ఉద్యోగాలు ఇప్పిస్తామని అభ్యర్థుల నుంచి భూములు రాయించుకున్నట్లు అభియోగాలు నమోదయ్యాయి. కాగా.. దీనిపై సీబీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

కాగా ఈ దాడులపై.. RJD తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో స్పందించింది. “ఇవి చిలుకలు” అంటూ సీబీఐపై పరోక్షంగా విమర్శలు చేసింది. “పంజరంలో ఉన్న చిలుక” అంటూ ప్రస్తావించింది.

లాలూ కుమార్తె.. రాబోయే ఎన్నికల్లో ఆమె RJD నుంచి రాజ్యసభకు పోటీ చేస్తారని స్థానిక మీడియా వర్గాలు పేర్కొంటున్న తరుణంలో.. మిసా భారతికి సంబంధించిన ఆస్తులపై దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.

కాగా.. దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన గత నెలలో జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఫిబ్రవరిలో ఆయనకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.60 లక్షల జరిమానా కూడా విధించింది.

Source Link

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..