AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Kavitha: మరో షాక్‌.. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు

ఢిల్లీ లిక్కర్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్‌ కేసులో ఈడీ మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో అరెస్ట్‌ అయిన ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఇప్పటికే జ్యూడీషియల్‌ కస్టడీలో ఉన్న కవితను ఎక్సైజ్‌ పాలసీ కేసులో సీబీఐ అరెస్టు చేసింది. ఇప్పటికే మధ్యంతర బెయిల్‌ కోసం కోర్టులో పిటిషన్‌ వేసిన కవితకు ఎదురు దెబ్బ తగిలింది...

MLC Kavitha: మరో షాక్‌.. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు
Mlc Kavitha
Subhash Goud
|

Updated on: Apr 11, 2024 | 2:56 PM

Share

ఢిల్లీ లిక్కర్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్‌ కేసులో ఈడీ మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో అరెస్ట్‌ అయిన ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఇప్పటికే జ్యూడీషియల్‌ కస్టడీలో ఉన్న కవితను ఎక్సైజ్‌ పాలసీ కేసులో సీబీఐ అరెస్టు చేసింది. ఇప్పటికే మధ్యంతర బెయిల్‌ కోసం కోర్టులో పిటిషన్‌ వేసిన కవితకు ఎదురు దెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు రౌస్‌ అరెన్యూ కోర్టు నిరాకరించింది. కవితను మరింతగా విచారించేందుకు ఈడీ కోర్టులో పిటిషన్‌ వేయగా, అందుకు కోర్టు కూడా అనుమతిచ్చింది. జైలులో ఉన్న కవితను ఈడీ విచారించనుంది. ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ కవితకు మరో షాకిచ్చింది.

కాగా, ఇప్పటికే ఈడీ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న కవిత.. ఈనెల6న తీహార్‌ జైలులో సీబీఐ విచారించింది. అయితే కవితను రౌస్‌ అరెన్యూ కోర్టులో హాజరు పర్చే అవకాశం ఉంది. కవితను సీబీఐ 10 రోజుల కస్టడీని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీలోని మద్యం లైసెన్సుల్లో అధిక వాటా కోసం ఢిల్లీలోని అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు లంచం ఇచ్చిన సౌత్ గ్రూప్‌లో కె కవిత కీలక సభ్యురాలు అని ఆరోపణలు వచ్చాయి. 2021-22 కోసం ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీలో సౌత్ గ్రూప్ పెద్ద, ముఖ్యమైన పాత్ర పోషించినట్లు ఈడీ పేర్కొంది. మద్యం కుంభకోణం నిందితుడు విజయ్ నగర్ ఈ గ్రూపు నుంచి రూ.100 కోట్లు అందుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో కవితను హైదరాబాద్‌లోని ఆమె ఇంటి నుంచి అరెస్టు చేశారు. దీంతో ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఆమెని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఏప్రిల్ 4న కేసును విచారించిన కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు.

Follow Us
భీమవరం స్టైల్ చికెన్ మజ్జిగ పులుసు.. కమ్మని టేస్ట్‌ పక్కా
భీమవరం స్టైల్ చికెన్ మజ్జిగ పులుసు.. కమ్మని టేస్ట్‌ పక్కా
బంగారాన్ని బీభత్సంగా కొన్న ఆ రెండు దేశాలు!
బంగారాన్ని బీభత్సంగా కొన్న ఆ రెండు దేశాలు!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
అట్టడుగు స్థానం నుంచి పైకి లేచిన చెన్నై.. టాప్‌లో ఆర్ఆర్ హవా
అట్టడుగు స్థానం నుంచి పైకి లేచిన చెన్నై.. టాప్‌లో ఆర్ఆర్ హవా
త్వరలో మరో వందే భారత్ స్లీపర్.. రూట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ
త్వరలో మరో వందే భారత్ స్లీపర్.. రూట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా..? ఒక్క మ్యాచ్ ఆడితే..
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా..? ఒక్క మ్యాచ్ ఆడితే..
మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..
మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..
చైనా సూపర్‌ కంప్యూటర్లను హ్యాక్‌..! నష్టం ఎంతంటే?
చైనా సూపర్‌ కంప్యూటర్లను హ్యాక్‌..! నష్టం ఎంతంటే?
ఆ కుండలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా.. ఆ లస్సీనే కావాలంటున్న జనం..
ఆ కుండలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా.. ఆ లస్సీనే కావాలంటున్న జనం..
లక్ష ఖర్చు చేసి తీసిన పాట.. ఎంత ఆదాయం వచ్చిందో చెప్పిన రాము ..
లక్ష ఖర్చు చేసి తీసిన పాట.. ఎంత ఆదాయం వచ్చిందో చెప్పిన రాము ..