పాక్ ప్రధాని మొసలి కన్నీరు.. బీహార్ కోర్టులో కేసు నమోదు
పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై బీహార్ కోర్టులో కేసు నమోదైంది. ఐక్యరాజ్యసమితిలో శుక్రవారం భారత్‌పై చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది సుధీర్‌కుమార్ ఓజా కేసు దాఖలు చేశారు. ఇమ్రాన్ తన ప్రసంగంలో భారత్‌పై అణుయుద్ధం దిశగా బెదిరించారంటూ తన పిటిషన్‌లో పేర్కొన్నారు సుధీర్‌కుమార్. తన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలంటూ ముజఫర్‌పూర్ చీఫ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆయన కోరారు. జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో దేశంలో మత సామరస్యం దెబ్బతినేలా పాక్ ప్రధాని వ్యాఖ్యానించారని […]
పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై బీహార్ కోర్టులో కేసు నమోదైంది. ఐక్యరాజ్యసమితిలో శుక్రవారం భారత్‌పై చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది సుధీర్‌కుమార్ ఓజా కేసు దాఖలు చేశారు. ఇమ్రాన్ తన ప్రసంగంలో భారత్‌పై అణుయుద్ధం దిశగా బెదిరించారంటూ తన పిటిషన్‌లో పేర్కొన్నారు సుధీర్‌కుమార్. తన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలంటూ ముజఫర్‌పూర్ చీఫ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆయన కోరారు. జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో దేశంలో మత సామరస్యం దెబ్బతినేలా పాక్ ప్రధాని వ్యాఖ్యానించారని తన పిటిషన్‌లో ఓజా ప్రస్తావించారు.
ఇదిలా ఉంటే జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌పై పాకిస్థాన్ అనేక విధాలుగా ఒత్తిడి పెంచేలా ప్రయత్నించి విఫలమైన విషయ తెలిసిందే. శుక్రవారం ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాని మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌లు ఇరువురు కశ్మీర్ పరిస్థితులపై మాట్లాడారు. అయితే పాక్ ప్రధాని మాత్రం భారత్‌పై విద్వేషం వెళగక్కడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్.. ప్రస్తుతం మొసలికన్నీరు కార్చుతుందని దుయ్యబడుతున్నారు.