Nora Fatehi: మనీలాండరింగ్ కేసులో నన్ను బలిపశువును చేశారు.. నోరా ఫతేహీ ఆవేదన

దాదాపు 200 కోట్ల రూపాయలు మనీలాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్‌ అరెస్టైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పటివరకు కూడా ఏదో ఒక ట్విస్టులు బయటపడుతూనే ఉన్నాయి. సుఖేష్ చంద్రశేఖర్‌కు బాలీవుడ్ తారలు జాక్వెలీన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహీలతో సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో వాళ్లిద్దరిని 2021లో ఈడీ కూడా విచారణ చేసింది.

Nora Fatehi: మనీలాండరింగ్ కేసులో నన్ను బలిపశువును చేశారు.. నోరా ఫతేహీ ఆవేదన
Nora Fatehi

Updated on: Jul 31, 2023 | 6:10 PM

దాదాపు 200 కోట్ల రూపాయలు మనీలాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్‌ అరెస్టైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పటివరకు కూడా ఏదో ఒక ట్విస్టులు బయటపడుతూనే ఉన్నాయి. సుఖేష్ చంద్రశేఖర్‌కు బాలీవుడ్ తారలు జాక్వెలీన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహీలతో సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో వాళ్లిద్దరిని 2021లో ఈడీ కూడా విచారణ చేసింది. ఆ తర్వాత జైల్లో ఉండగానే సుఖేష్ జాక్వేలీన్‌కు ప్రేమ లేఖలు పంపడం వైరల్ అయ్యాయి. అలాగే అతడు నోరా ఫతేహి గురించి కూడా పలు వ్యాఖ్యలు చేశాడు. ఆమె తనకు రోజుకు పదిసార్లు ఫోన్ చేసేదని.. జాక్వేలిన్‌ను వదిలిపెట్టాలని తరచూ చెబుతుండేదంటూ చెప్పాడు. ఇవన్నీ కూడా ఇటీవల వార్తల్లో రావడంతో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే తాజాగా ఇందుకు సంబంధించిన విషయం నోరా ఫతేహీ స్పందించింది. మనీలాండరింగ్ కేసులో తనని బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనను గోల్డ్ డిగ్గర్ అంటూ అవమానించారని వాపోయింది.

జాక్వెలైన్‌ ఫెర్నాండేజ్‌ పై వేసిన పరువు నష్టం కేసులో సోమవారం ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టుకు నోరా హాజరైంది. ఈ సందర్భంగా ఆమె తన వాదనలు వినిపించింది. 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్‌తో తనకి సంబంధం ఉందని ఆరోపించారని చెప్పింది. అందరి దృష్టి మళ్లించేందుకే ఆ కేసులోకి తనను లాగారని నోరా తన వాదనను వినిపించింది. అలాగే తన పేరును ఈ కేసులో వాడటంతో వృత్తిపరంగా తన అవకాశాలు దెబ్బతిన్నాయని, మానసిక సమస్యలు తలెత్తాయని నోరా ఫతేహి తెలిపారు. ప్రస్తుతం సుకేశ్‌ చంద్రశేఖర్ కేసును ఈడీ విచారిస్తోందని.. దాంతో నాకు ఎటువంటి సంబంధం లేదని.. ఆ కేసులోని వ్యక్తులు తనకు తెలియదని చెప్పారు. . కొంతమంది వ్యక్తుల్ని కాపాడేందుకు మీడియాలో నాపై తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు . ఎందుకంటే తాను ఈ దేశస్థురాలిని కాదని.. ఇక్కడ ఒంటరిగా ఉంటున్నానని.. అందుకే తాను కేసు వేయాల్సి వచ్చిందని తెలిపారు. గత కొద్ది ఏళ్లుగా తాను నిర్మించుకున్న కెరీర్‌కు భంగం వాటిల్లిందని.. అందుకు తనకు పరిహారం లభించాలని ఆమె కోరారు.
మనీలాండరింగ్ కేసులో సుకేశ్‌తో పాటు జాక్వెలిన్ కూడా నిందితురాలని.. జాక్వెలిన్ దురుద్దేశంతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని గత ఏడాది ఆమెపై నోరా ఫతేహి పరువు నష్టం కేసు వేశారు.