
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సినిమాటోగ్రఫీ -2023 ముసాయిదా చట్టానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పైరసీని నిరోధించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందని కేంద్రం తెలిపింది. నేషనల్ క్వాంటమ్ మిషన్‌కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఎలిఫెంట్ విస్పర్స్ , ట్రిపులార్ లాంటి సినిమాలకు అంతర్జాతీయంగా పేరు వచ్చిందని , ఇలాంటి సినిమాలను పైరసీ నుంచి కాపాడాల్సిన అవసరం ఉందన్నారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్. నేషనల్ క్వాంటమ్ మిషన్ కేవలం ఆరుదేశాల్లో మాత్రమే ఉందన్నారు . దీంతో డేటా మార్పిడి వేగంగా జరుగుతుందని తెలిపారు.
రానున్న పార్లమెంట్ సమావేశాల్లో సినిమాటోగ్రఫీ చట్టాన్ని పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెడు తుంది. ఓటీటీ కంటెంట్ నియంత్రణపై కూడా ఈ బిల్లులో పలు ప్రతిపాదనలు ఉండే అవకాశం ఉంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అశ్లీలత పెరిగిపోయిందని , నియంత్రించాలని కేంద్రానికి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త సినిమాలనపై పైరసీ చేసే వాళ్లకు కఠిన శిక్షలు విధించేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి