Building Collapses: రెండు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం

బదర్‌పూర్‌లోని మోలార్‌బంద్ ప్రాంతంలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. భవనం కింది భాగంలో గోదాం ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఒక్కసారిగా అగ్నిప్రమాదం ఏర్పడడంతో.. ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది.

Building Collapses:  రెండు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
Delhi Fire Accident

Updated on: Mar 28, 2023 | 11:43 AM

ఢిల్లీ బదర్‌పూర్‌లోని రెండంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటల కారణంగా భవనం పూర్తిగా కుప్పకూలింది. ప్రమాద ఘటనా స్థలంలో 18 అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. భవనం కుప్పకూలడంతో శిథిలాలు చుట్టుపక్కల వ్యాపించాయని, మంటలను ఆర్పడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఓ అధికారి తెలిపారు. శిథిలాలను తొలగించాల్సి ఉంటుందని అప్పుడే మంటలను ఆర్పడం సులభం అవుతుందని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ ఏడీపీ రాజేష్ శుక్లా తెలిపారు. అగ్నిమాపక దళం బృందం మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉంది.

బదర్‌పూర్‌లోని మోలార్‌బంద్ ప్రాంతంలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. భవనం కింది భాగంలో గోదాం ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఒక్కసారిగా అగ్నిప్రమాదం ఏర్పడడంతో.. ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. సహాయం కోసం అరవడం ప్రారంభించారు. ఇంతలో ఎవరో ఫోన్ చేసి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అనంతరం 18 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఘటనా స్థలం వద్దకు భారీ సంఖ్యలో జనం చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ అగ్నిప్రమాదం వల్ల భారీ నష్టం వాటిల్లిందని కొందరు అంచనా వేస్తున్నారు. ఇంట్లోని విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. అయితే ఎంత నష్టం జరిగిందో అంచనా వేయాల్సి ఉంటుంది.

 

అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా  

అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే షార్ట్‌సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతామని తెలిపారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..