AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CPRI Recruitment 2023: నెలకు రూ.1,42,400ల జీతంతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు అవసరం..

భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ పవర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌.. 99 ఇంజినీరింగ్‌ ఆఫీసర్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌, అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

CPRI Recruitment 2023: నెలకు రూ.1,42,400ల జీతంతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు అవసరం..
CPRI
Srilakshmi C
|

Updated on: Mar 28, 2023 | 1:48 PM

Share

భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ పవర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌.. 99 ఇంజినీరింగ్‌ ఆఫీసర్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌, అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ / ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ / ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ / మెకానికల్ ఇంజినీరింగ్ / సివిల్ ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/ డిప్లొమా/ బీఈ/ బీఎస్సీ/ బీకామ్‌/ బీసీఏ/ ఇంజినీరింగ్‌ డిప్లొమా/ ఇంజినీరింగ్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంజినీరింగ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గేట్‌ 2021/ 2022/ 2023లో అర్హత సాధించాలి. దరఖాస్తుదారుల వయసు 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్‌ 14, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.1000లు చెల్లించాలి. ఆన్‌లైన్‌ రాత పరీక్ష/గేట్‌ స్కోర్‌/స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి ఈ కింది విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

పోస్టుల వారీగా జీతభత్యాల వివరాలు..

  • ఇంజినీరింగ్ ఆఫీసర్‌ గేడ్‌ 1 పోస్టులకు నెలకు రూ.44,900ల నుంచి రూ.1,42,400ల వరకు చెల్లిస్తారు.
  • సైంటిఫిక్ అసిస్టెంట్/ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు నెలకు రూ.35,400ల నుంచి రూ.1,12,400ల వరకు చెల్లిస్తారు.
  • టెక్నీషియన్‌ గ్రేడ్‌ 1 పోస్టులకు నెలకు రూ.19,900ల నుంచి రూ.63,200ల వరకు చెల్లిస్తారు.
  • అసిస్టెంట్ గ్రేడ్ II పోస్టులకు నెలకు రూ.25,500ల నుంచి రూ.81,100ల వరకు చెల్లిస్తారు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే