Budget Session : అసెంబ్లీ చరిత్రలో సంచలనం.. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు..!
బెంగాల్ దీదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ సమావేశాల తొలిరోజు గవర్నర్‌ను ఆహ్వానించకుండానే అసెంబ్లీని నిర్వహించింది తృణమూల్ ప్రభుత్వం. సభలో బడ్జెట్‌ను..
Budget Session : బెంగాల్ దీదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ సమావేశాల తొలిరోజు గవర్నర్‌ను ఆహ్వానించకుండానే అసెంబ్లీని నిర్వహించింది తృణమూల్ ప్రభుత్వం. సభలో బడ్జెట్‌ను సీఎం మమతా బెనర్జీ ప్రవేశపెట్టారు. అయితే గవర్నర్‌ను ఆహ్వానించకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
మమత ప్రసంగాన్ని అడ్డుకున్నేందుకు విపక్ష ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. వాళ్లపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మమత బడ్జెట్ ప్రసంగాన్ని సీపీఎం , కాంగ్రెస్ సభ్యులు కూడా బహిష్కరించారు. సభ బయట బీజేపీ సభ్యులు ఆందోళన చేశారు. మమతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బెంగాల్ పోలీసు శాఖలో కొత్తగా నేతాజీ బెఠాలియన్ ఏర్పాటు చేస్తునట్టు మమత బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. నేతాజీ వారసత్వం కోసం అటు బీజేపీ , ఇటు తృణమూల్ మధ్య ఫైట్ కొనసాగుతోంది. ఎన్నికల వేళ బెంగాల్‌లో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు ఇరుపార్టీల నేతలు.
A new battalion – Netaji Battalion – will be formed in Kolkata Police Force: West Bengal CM Mamata Banerjee in the state Legislative Assembly pic.twitter.com/5dScmIQZtc
— ANI (@ANI) February 5, 2021
ఇవి కూడా చదవండి :
ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం… సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాల మాఫీ
Czech Woman Marry Gujranwala : ఔను.. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు.. ఆమెకు 65.. ఆయనకు 23..
Share Market News Today : స్టాక్ మార్కెట్లో బడ్జెట్ ర్యాలీ.. ఐదవ రోజు కొనసాగిన బుల్ జోష్..