Share Market News Today : స్టాక్ మార్కెట్లో బడ్జెట్ ర్యాలీ.. ఐదవ రోజు కొనసాగిన బుల్ జోష్..
స్టాక్ మార్కెట్లో బడ్జెట్ ర్యాలీ శుక్రవారం కూడా కొనసాగింది. దీంతో సూచీలు వీకెండ్‌లో కూడా లాభాల్లోనే ముగిశాయి. వరుస లాభాలతో మార్కెట్లు మరోసారి రికార్డులు సృష్టించాయి. శుక్రవారం సెషన్‌లో..
Sensex Ends Above : స్టాక్ మార్కెట్లో బడ్జెట్ ర్యాలీ శుక్రవారం కూడా కొనసాగింది. దీంతో సూచీలు వీకెండ్‌లో కూడా లాభాల్లోనే ముగిశాయి. వరుస లాభాలతో మార్కెట్లు మరోసారి రికార్డులు సృష్టించాయి. శుక్రవారం సెషన్‌లో బీఎస్‌ఈ సూచీ సెన్సెక్స్ 117 పాయింట్లు పెరిగి గరిష్ఠమైన 50,700 పైకి చేరింది. నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 14 వేల 900 మార్క్‌ను దాటేసింది.
అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలతలకు తోడు బడ్జెట్ఉత్సాహంలాభాల జోష్ ప్రధాన కారణంగా మారింది. ఫార్మా రంగం షేర్లు ప్రధానంగా లాభాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 51,073 పాయింట్ల అత్యధిక స్థాయి చేరుకుంది. 50,565 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
ఇక నిఫ్టీ విషయానికి వస్తే.. 15,014 పాయింట్ల గరిష్ఠ స్థాయితో సరికొత్త రికార్డు సృష్టించింది. 14,864 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కొనసాగింది. ఈ రోజు లాభపడినవాటిలో ఎస్‌బీఐఎన్(SBIN), ఐటీసీ(ITC), పవర్‌గ్రిడ్(POWERGRID), బజాజ్ఫినాస్స్(Bajaj Finance), ఎన్టీపీసీ(NTPC), టాటాస్టీల్(Tata Steel Share), కోటక్ బ్యాంక్ ( Kotak Mahindra Bank), దివీస్ ల్యాబ్ షేర్లు ఎక్కువగా లాభాలను గడించాయి.
ఇవి కూడా చదవండి :
Czech Woman Marry Gujranwala : ఔను.. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు.. ఆమెకు 65.. ఆయనకు 23..
ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం… సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాల మాఫీ