
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జె్‌ట్‌పై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. వికసిత్ భారత్‌కు ఈ బడ్జెట్ అంకితమని చెప్పారు. ఉపాథికి ఎన్నో అవకాశాలు బడ్జెట్ కల్పిస్తోందన్న ప్రధాని.. దేశ యువత ఆకాంక్షలకు ఈ బడ్జెట్ ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు. ఈ బడ్జెట్ భారతదేశానికి బలమైన పునాది వేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ బడ్జెట్‌లో సంస్కరణలు తీసుకొస్తామన్నారు. ప్రతి భారతీయుడి కలలను సాకారం చేసే బడ్జెట్ ఇది.
ఈ బడ్జెట్ నుంచి పెట్టుబడులు వస్తాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ బడ్జెట్ దేశ ప్రజలందరిది. ఇది జనతా జనార్దన్ బడ్జెట్. ఇందుకు నిర్మలా సీతారామన్‌కు, ఆమె బృందాన్ని ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. దేశం అభివృద్ధి, వారసత్వం మీద నడుస్తోందని ప్రధాని మోదీ అన్నారు. అన్ని వైపుల నుంచి ఉపాధిని కల్పించే బడ్జెట్ ఇదన్న ప్రధాని, ఈ బడ్జెట్‌లో టూరిజం ఉపాధి కల్పిస్తుందని ప్రధాని స్పష్టం చేశారు.
ఈ బడ్జెట్‌లో రూ. 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు చేశామని ప్రధాని మోదీ అన్నారు. ఈ బడ్జెట్‌లో కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని రూ.5 లక్షలకు పెంచామన్నారు. బడ్జెట్‌లో రైతుల కోసం అనేక ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. ఈ బడ్జెట్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందన్న ప్రధాని.. ఇది పౌరుల జేబులు నింపే బడ్జెట్ అని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్‌తో స్వావలంబన భారత్‌కు ఊపు వస్తుంది. బడ్జెట్‌లో మధ్యతరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిందని, ఈ బడ్జెట్‌లో స్టార్టప్‌లకు కొత్త క్రెడిట్‌ను ప్రకటించామని ప్రధాని మోదీ తెలిపారు.
The #ViksitBharatBudget2025 reflects our Government’s commitment to fulfilling the aspirations of 140 crore Indians. https://t.co/Sg67pqYZPM
— Narendra Modi (@narendramodi) February 1, 2025
సాధారణంగా బడ్జెట్‌లో ప్రభుత్వ ఖజానా ఎలా నింపుతుందనే దానిపైనే దృష్టి కేంద్రీకరిస్తారని ప్రధాని మోదీ అన్నారు. కానీ ఈ బడ్జెట్ దానికి పూర్తి విరుద్ధం అని, ఈ బడ్జెట్ దేశ పౌరుల జేబులు ఎలా నింపాలన్న దానికి అనుగుణంగా రూపొందించామన్నారు. దేశ పౌరుల పొదుపు ఎలా పెరుగుతుంది. దేశ పౌరులు అభివృద్ధిలో ఎలా భాగస్వాములవుతారు? దానికి ఈ బడ్జెట్ చాలా బలమైన పునాది వేసిందని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఈరోజు ఒక ముఖ్యమైన మైలురాయి అని ప్రధాని అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షల బడ్జెట్ ఇది, ప్రతి భారతీయుడి కలలను సాకారం చేసే బడ్జెట్ ఇది. యువత కోసం అనేక రంగాలను తెరిచాం. ఇది అభివృద్ధి చెందిన భారతదేశ మిషన్‌ను డ్రైవ్ చేయబోతోంది. ఇది బడ్జెట్ ఫోర్స్ మల్టిప్లైయర్‌గా ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
Income tax calculator tool