సొంత రికార్డును బద్దలుకొట్టిన BSF జాగిలం.. సాహసం చూస్తే రోమాలు నిక్కబొడవాల్సిందే – Watch Video

భద్రతా దళంలో ఉండే జాగిలాలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎల్లప్పుడూ అలెర్ట్‌గా ఉండే జాగిలాలు.. కొంచెం తేడా వచ్చిన వేటాడేస్తాయి.

సొంత రికార్డును బద్దలుకొట్టిన BSF జాగిలం.. సాహసం చూస్తే రోమాలు నిక్కబొడవాల్సిందే - Watch Video
Bsf Dog

Updated on: Feb 16, 2023 | 5:12 PM

భద్రతా దళంలో ఉండే జాగిలాలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎల్లప్పుడూ అలెర్ట్‌గా ఉండే జాగిలాలు.. కొంచెం తేడా వచ్చిన వేటాడేస్తాయి. పోలీస్‌ జాగిలాలు శిక్షణ పొందిన నాటి నుంచి అవి రిటైర్డ్‌ అయ్యే వరకు.. సేవలు అందిస్తూనే ఉంటాయి. ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో, బాంబులను పసిగట్టడంలో, దుండగులను పట్టుకోవడం, ఇలా ఎన్నో ఆపరేషన్లలో జాగిలాలు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తాయన్న విషయం తెలిసిందే. తాజాగా.. సరిహద్దు భద్రతా దళానికి (BSF) చెందిన జాగిలం.. ఫైయింగ్‌ మూన్ జంప్‌లో తన రికార్డును తానే బద్దలుకొట్టింది. మధ్యప్రదేశ్‌లోని ఎన్‌టిసిడి బిఎస్‌ఎఫ్‌లో శిక్షణా సెషన్‌లో బుధవారం ఈ జాగిలం ఈ రికార్డును సాధించిందని బీఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు.

మధ్యప్రదేశ్‌లోని టేకాన్‌పూర్‌లోని బీఎస్‌ఎఫ్‌లోని నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్ (ఎన్‌టిసిడి)లో జాగిలం ఈ రికార్డును నెలకొల్పినట్లు అధికారులు తెలిపారు. ‘ఫ్లయింగ్ మూన్ జంప్’ సమయంలో ఒక మగబెల్జియన్ మాలినోయిస్ 15 అడుగుల 6 అంగుళాల ఎత్తులో దూకి దాని పేరును ఉన్న రికార్డును అదే బ్రేక్ చేసినట్లు తెలిపారు. ఈ జాగిలానికి ట్రైనింగ్ ఇస్తున్న (హ్యాండ్లర్) CT పుష్పేంద్ర శర్మ ఈ ఘనత సాధించడంలో దానికి సహాయం చేశారని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ఈ జాగిలం కూర్చొని లేదా ఎత్తు నుంచి లక్ష్యాన్ని చేరుకోవడం, సెర్చ్‌ ఆపరేషన్లలో దుండగుల దృష్టి మరల్చడం, ఆయుధాన్ని పొందడం.. ఇలా అన్నింటిలోనూ ఆరితేరి ఉందని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

 

Follow Us