Bomb Threat: అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపులు.. మరో మూడు రైల్వేస్టేషన్లకూ వార్నింగ్..

Amitabh Bachchan's bungalow: ఆర్థిక రాజధాని ముంబై నగరంలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి.

Bomb Threat: అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపులు.. మరో మూడు రైల్వేస్టేషన్లకూ వార్నింగ్..
Bomb Threat

Updated on: Aug 07, 2021 | 10:06 AM

Amitabh Bachchan’s bungalow: ఆర్థిక రాజధాని ముంబై నగరంలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఇంటిని బాంబులతో పేల్చివేస్తామని అగంతకులు బెదిరించారు. దీంతోపాటు ముంబై నగరంలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లను పేల్చి వేస్తామని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు.

అయితే ఇప్పటివరకు నిర్వహించిన సెర్చింగ్ ఆపరేషన్‌లో అనుమానాస్పదంగా ఏ వస్తువు లభ్యం కాలేదని ముంబై పోలీసులు తెలిపారు. ముంబై పోలీసు ప్రధాన కంట్రోల్ రూమ్‌కు శుక్రవారం రాత్రి కాల్ వచ్చిందని పేర్కొన్నారు. ఆగంతకుడు.. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), బైకుల్లా, దాదర్ రైల్వే స్టేషన్‌లతోపాటు.. జుహులోని నటుడు అమితాబ్ బచ్చన్ బంగ్లా వద్ద బాంబులు ఉంచినట్లు.. చెప్పాడని పోలీసులు తెలిపారు.

బెదిరింపు ఫోన్ అనంతరం.. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లు, స్థానిక పోలీసు సిబ్బందితో పాటు రైల్వే రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆయా ప్రదేశాలకు చేరుకుని సెర్చ్ ఆపరేషన్ చేపట్టామని పోలీసు కమిషనర్ వెల్లడించారు. అయితే.. అనుమానాస్పదంగా ఏదీ కనుగొనలేదని.. కానీ.. ఆయా ప్రాంతాల్లో భారీగా పోలీసు సిబ్బందిని మోహరించినట్లు పేర్కొన్నారు. కాగా.. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు చేశారన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

Crime News: కొన్ని నెలలుగా ఇంటికి తాళం.. తెరిచి చూడగానే షాకైన కుటుంబం.. అసలేం జరిగిందంటే..?

Crime: పెళ్లి కాకుండానే ప్రసవం.. ఆపై బిడ్డను కిటికీలోంచి విసిరేసి.. చివరకు ఏం జరిగిందంటే..?