గంగానదిలో ఘోర ప్రమాదం.. 18 ప్రయాణికులతో వెళ్తున్న బోటు బోల్తా.. పలువురు గల్లంతు..

ఆదివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో గోలాఘాట్ నుంచి సక్రి గాలికి డింగీ బోటు బయలుదేరింది. నది మధ్యలో కరెంట్ రావడంతో బోటు బ్యాలెన్స్ తప్పి బోల్తా పడింది. ప్రమాదం జరగడంతో ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. కొంతమంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యల కోసం డైవర్లను రంగంలోకి దించారు. గల్లంతైన నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

గంగానదిలో ఘోర ప్రమాదం.. 18 ప్రయాణికులతో వెళ్తున్న బోటు బోల్తా.. పలువురు గల్లంతు..
Boat Capsized In Katihar

Updated on: Jan 19, 2025 | 1:01 PM

బీహార్‌లోని కతిహార్ జిల్లాలో గంగా నదిలో ఆదివారం ఉదయం పెను ప్రమాదం జరిగింది. జార్ఖండ్‌లోని గోలాఘాట్‌ నుంచి సక్రి గాలికి వెళ్తున్న పడవ నది మధ్యలో బోల్తా పడింది. పడవలో దాదాపు 18 మంది ఉన్నట్టుగా తెలిసింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఓ చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారని సమాచారం. నలుగురిని రక్షించగా, మరో నలుగురు గల్లంతయ్యారు. అందిన సమాచారం ప్రకారం.. ఆదివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో గోలాఘాట్ నుంచి సక్రి గాలికి డింగీ బోటు బయలుదేరింది. నది మధ్యలో కరెంట్ రావడంతో బోటు బ్యాలెన్స్ తప్పి బోల్తా పడింది. ప్రమాదం జరగడంతో ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. కొంతమంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యల కోసం డైవర్లను రంగంలోకి దించారు. ఇప్పటి వరకు ఓ చిన్నారి సహా మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. నలుగురిని సురక్షితంగా రక్షించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. గల్లంతైన నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

బోటులో కెపాసిటీ కంటే ఎక్కువ మంది ఉన్నారని, దీంతో బోటు బ్యాలెన్స్ కోల్పోయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై యంత్రాంగం విచారణ జరుపుతోంది. ఈ ఘటన బోట్ల భద్రత, ఓవర్‌లోడింగ్ సమస్యలపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..