
లోక్‌సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్న వేళ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకం తాంత్రిక పూజలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కేరళలోని ఓ దేవాలయంలో రాజకీయ ప్రత్యర్థులు ‘అఘోరీలు’, ‘తాంత్రికుల’ ద్వారా చేతబడి చేస్తున్నారని డీకే శివకుమార్ అన్నారు. ఇది తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రయత్నమని ఆయన మండిపడ్డారు.
కేరళలోని రాజరాజేశ్వరి ఆలయానికి సమీపంలోని ఏకాంత ప్రదేశంలో అఘోరీలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తనకు విశ్వసనీయ సమాచారం ఉందని శివకుమార్ చెప్పారు. “కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, సీఎం సిద్దరామయ్య తోపాటు తనకు వ్యతిరేకంగా ఆచారం జరుగుతోందన్నారు. అఘోరీల యాగం ప్రధాన లక్ష్యం శత్రువులను నిర్మూలించడం అన్నారు. ‘రాజ కంటక’, ‘మరణ మోహన స్తంభన’ యాగాలు నిర్వహింస్తున్నారని తెలిపారు. అఘోరీల ద్వారా 21 ఎర్ర మేకలు, మూడు గేదెలు, 21 నల్లగొర్రెలు, ఐదు పందులను చేతబడికి బలి ఇస్తున్నారని తెలిపారు.
భారతీయ జనతా పార్టీ , జెడి-ఎస్ నాయకులు ఈ ఆచారాన్ని నిర్వహిస్తున్నారా అని అడిగినప్పుడు, కర్ణాటకకు చెందిన రాజకీయ నాయకులే బాధ్యత వహించారని శివకుమార్ సమర్థించారు. “ఈ కర్మను ఎవరు నిర్వహిస్తున్నారో నాకు తెలుసు. వారి దుష్ట ప్రయత్నాలకు భయపడేదీలేదన్నారు. వారి నమ్మక వ్యవస్థకే వదిలేస్తున్నా, నేను నమ్మిన శక్తి నన్ను రక్షిస్తుంది, ”అంటూ శివకుమార్ పునరుద్ఘాటించారు. ఈ ఆచారానికి వ్యతిరేక పూజలు చేస్తారా అనే ప్రశ్నకు శివకుమార్ బదులిస్తూ, “నేను ప్రతిరోజూ పనికి వెళ్ళే ముందు ఒక నిమిషం పాటు దేవుడిని ప్రార్థిస్తాను” అని చెప్పాడు. అటువంటి ఆచారాన్ని నిర్వహిస్తున్న వ్యక్తుల పేర్లు చెప్పాలని ఒత్తిడి చేసినప్పుడు, శివకుమార్ తన పేర్లను వెల్లడించమని బలవంతం చేయకుండా మీడియా దర్యాప్తు చేయాలని సూచించారు.
ఇదిలావుంటే, జూన్ 2న (ఆదివారం) బెంగళూరులో శాసనసభ్యుల సమావేశం ఉంటుందని శివకుమార్ ప్రకటించారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరినీ ఆహ్వానించామన్నారు. ఈ సమావేశంలో పార్టీ వ్యవహారాలు, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనయుడు డాక్టర్ యతీంద్ర తన తండ్రి కోసం ఎమ్మెల్యే సీటును వదులుకున్నప్పటి నుంచి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిబద్ధత ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో పరాజయం పాలైన వారితోపాటు ప్రముఖ నేతలు టికెట్లు కోరుతున్నారు. తమ సీట్లను త్యాగం చేసిన అభ్యర్థులను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. కళ్యాణ కర్ణాటక, ముంబై కర్ణాటక, కోస్తా, మధ్య కర్ణాటక వంటి ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. బెంగళూరుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం సాధ్యం కాదని ఆయన అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..