తీవ్ర జ్వరం.. ఎయిమ్స్‌లో చేరిన ఉమా భారతి

| Edited By:

Sep 29, 2020 | 10:52 AM

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి ఆసుపత్రిలో చేరారు. మూడు రోజుల క్రితం ఉమా భారతికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా

తీవ్ర జ్వరం.. ఎయిమ్స్‌లో చేరిన ఉమా భారతి
Follow us on

Uma Bharti AIIMS: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి ఆసుపత్రిలో చేరారు. మూడు రోజుల క్రితం ఉమా భారతికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. జ్వరం తీవ్రమవ్వడంతో రిషికేష్‌లోని ఎయిమ్స్‌లో చేరినట్లు ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆదివారం రాత్రి జ్వరం ఎక్కువగా అవ్వడంతో సన్నిహితులు ఆందోళనకు గురయ్యారని, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ సైతం తన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారని.. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చేరినట్లు ఆమె వెల్లడించారు. ఇక డాక్టర్లు అనుమతిస్తే బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన విచారణ నిమిత్తం బుధవారం లఖ్‌నవులోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరవుతానని ఉమా భారతి అన్నారు.

కాగా హిమాలయాల్లో నివసించే సాధువుల నుంచి ఉమా భారతికి కరోనా సోకినట్లు వార్తలు రాగా.. వాటిని ఆమె ఖండించారు. తన కారు డ్రైవర్‌కి మొదట కరోనా సోకిందని, ఆ తరువాత జరిపిన పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. వైరస్ సోకిన విషయం డ్రైవర్‌కి ముందు తెలీదని వివరించారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,072 కొత్త కేసులు.. 9 మరణాలు

Breaking: శేఖర్‌ రెడ్డికి క్లీన్‌ చిట్‌ ఇచ్చిన సీబీఐ కోర్టు