Breaking: శేఖర్‌ రెడ్డికి క్లీన్‌ చిట్‌ ఇచ్చిన సీబీఐ కోర్టు

పాత నోట్ల మార్పిడి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ బోర్డు సభ్యులు, పారిశ్రామిక వేత్త శేఖర్ రెడ్డికి సీబీఐ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.

Breaking: శేఖర్‌ రెడ్డికి క్లీన్‌ చిట్‌ ఇచ్చిన సీబీఐ కోర్టు
Follow us

| Edited By:

Updated on: Sep 29, 2020 | 8:41 AM

Sekhar Reddy CBI: పాత నోట్ల మార్పిడి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ బోర్డు సభ్యులు, పారిశ్రామిక వేత్త శేఖర్ రెడ్డికి సీబీఐ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.  ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం.. సరైన ఆధారాలు సమర్పించడంలో సీబీఐ విఫలమైందని వెల్లడించింది. దీంతో ఈ కేసును మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో పాతనోట్లు, నగదు చెలామణీ నేరంతో సీబీఐ నమోదు చేసిన రెండు కేసులను కొట్టివేస్తూ చెన్నై సీబీఐ కోర్టు తీర్పును వెలువరించింది.

కాగా గతంలో పాత నోట్లను రద్దు చేసిన సమయంలో నిబంధనలను అతిక్రమిస్తూ భారీగా పాతనోట్ల మార్పిడికీ పాల్పడ్డారంటూ శేఖర్‌ రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. వివిధ బ్యాంకుల ద్వారా భారీగా పాతనోట్ల మార్పిడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో రూ.247.13కోట్లు దారి మళ్లించారని ఎఫ్‌ఐఆర్‌, ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. దీనిపై విచారణ జరిపిన చెన్నై సీబీఐ కోర్టు.. శేఖర్ రెడ్డితో పాటు ఇదే కేసులో ఉన్న మరో ఐదు మందికి క్లీన్ చిట్ ఇచ్చింది.

Read More:

Bigg Boss 4: బిగ్‌బాస్ ‘టాస్క్‌’.. అభితో రెచ్చిపోయిన స్వాతి

Bigg Boss 4: లాస్య-నోయెల్ మధ్య గొడవ.. ఉఫ్‌మన్న వీక్షకులు