BJP Meeting in Delhi : 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న బీజేపీ.. ఢిల్లీలో పార్టీ పెద్దలతో కీలక సమావేశం..

BJP Meeting in Delhi : వచ్చే ఏడాది జరగబోయే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సమాయత్తమవుతోంది.

BJP Meeting in Delhi : 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న బీజేపీ.. ఢిల్లీలో పార్టీ పెద్దలతో కీలక సమావేశం..
BJP

Updated on: Jun 26, 2021 | 4:01 PM

BJP Meeting in Delhi : వచ్చే ఏడాది  జరగబోయే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సమాయత్తమవుతోంది. తాజాగా ఢిల్లీలో పార్టీ పెద్దలతో కీలక సమావేశం నిర్వహిస్తోంది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మల సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్, స్మృతి ఇరానీ, కిరెన్ రిజిజు సహా పలువురు పార్టీ ప్రముఖులు హాజరయ్యారు. సమావేశంలో ఎన్నికలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది తొలి అర్థభాగంలో యూపీతో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

అయితే పంజాబ్ మినహా మిగతా 4 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రెండు సార్లు ఢిల్లీ పీఠాన్ని అప్పగించడంలో ముఖ్య పాత్ర పోషించిన యూపీపై నేతలు దృష్టి సారించే అవకాశం ఉంటుంది. గతంలో మాదిరి పొరపాట్లు చేయకుండా చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారమే వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు కసరత్తు కూడా ప్రారంభించింది.

ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరిగిన మిని సంగ్రామం మాదిరిగానే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల పోరు ఉత్కంఠగా ఉండనుంది. కరోనా వైరస్‌ విజృంభణ వేళ.. బీహార్‌, పశ్చిమబెంగాల్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో జరిపిన ఎన్నికల నిర్వహణ నుంచి ఎంతో అనుభవాన్ని పొందినట్లు కేంద్ర ఎన్నికల సంఘం పునరుద్ఘాటించింది. ప్రస్తుతం వైరస్‌ ఉద్ధృతి తగ్గుముఖం పడుతుండడంతో వచ్చే ఏడాదిలో ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయనే ఆశాభావం వ్యక్తం చేసింది.

The Black Tiger: పాకిస్థాన్ లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేసి.. కొలీగ్ చేసిన పనికి దొరికి 16 ఏళ్ళు నరకం చూపించినా రహస్యం చెప్పని వీరుడు ఎవరో తెలుసా

Star Maa: బడా మూవీలపై ఫోకస్ చేసిన ప్రముఖ ఛానల్.. భారీ సినిమాల శాటిలైట్స్ రైట్స్ దక్కించుకున్న స్టార్ మా..

Delta Variant: డెల్టా వేరియంట్ ప్రమాదకరమే.. పేద దేశాలకు వ్యాక్సిన్ అందించాలి: డబ్ల్యూహెచ్ఓ