BJP MP Arjun Singh: బెంగాల్‌లో బీజేపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బరక్‌పూర్ ఎంపీ అర్జున్‌సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. అభిషేక్ బెనర్జీ సమక్షంలో కోల్‌కతాలోని టీఎంసీ కార్యాలయంలో అర్జున్ తృణమూల్ కాంగ్రెస్ ( Trinamool Congress) లో చేరారు. బెంగాల్‌లో ఇప్పటివరకు ఇద్దరు బీజేపీ ఎంపీలు తృణమూల్ గూటికి చేరారు. బీజేపీకి రాజీనామా చేసిన మాజీ కేంద్రమంత్రి బబుల్ సుప్రియో ఇప్పటికే మమతా బెనర్జీ పార్టీ టీఎంసీలో చేరిన విషయం తెలిసిందే. కాగా.. సొంతగూటికి చేరుకున్నందుకు చాలా ఆనందంగా ఉందంటూ అర్జున్‌సింగ్ ఈ సందర్బంగా పేర్కొన్నారు. ఎంపీ కాక ముందు ఆయన 19 ఏళ్ల పాటు టీఎంఎసీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమయ్యిందని ఆరోపించారు అర్జున్‌సింగ్. బెంగాల్‌లో బీజేపీ కేవలం ఫేస్‌బుక్‌కు మాత్రమే పరిమితం అయ్యిందని విమర్శించారు. అర్జున్‌సింగ్ బీజేపీకి రాజీనామా చేసిన తరువాత ఆయన మద్దతుదారులు బీజేపీ జెండాలను, ప్రధాని మోదీ కటౌట్లను తొలగించారు.
కాగా.. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు బారక్‌పూర్ స్థానంలో టీఎంసీ.. దినేష్ త్రివేదికి టికెట్ ఇవ్వడంతో అర్జున్ సింగ్ తృణమూల్‌ను వీడారు. ఈ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన త్రివేదిపై ఆయన విజయం సాధించారు. కాగా.. అర్జున్ సింగ్ కుమారుడు పవన్ సింగ్ భట్పరా నుంచి బిజెపి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా తండ్రి అడుగుజాడల్లోనే టీఎంసీలో చేరే అవకాశముందని పేర్కొంటున్నారు. కాగా.. పవన్ సింగ్ దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.
Warmly welcoming former Vice President of @BJP4Bengal and MP from Barrackpore, Shri @ArjunsinghWB into the All India Trinamool Congress family.
He joins us today in the presence of our National General Secretary Shri @abhishekaitc. pic.twitter.com/UuOB9yp9Xo
— All India Trinamool Congress (@AITCofficial) May 22, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..