12 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ కి నిరసనగా మహారాష్ట్ర అసెంబ్లీ బయట బీజేపీ సభ్యుల ‘పోటీ సెషన్’ !

| Edited By: Anil kumar poka

Jul 06, 2021 | 2:13 PM

అసెంబ్లీ నుంచి తమ 12 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ కి నిరసనగా మంగళవారం మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట 'పోటీ సభ' (సెషన్) నిర్వహించారు. ఈ సెషన్ లో స్పీకర్ గా కాళిదాస్ కొలంబకర్ వ్యవహరిస్తారని మహారాష్ట్ర విధాన పరిషత్ లో విపక్ష నేత ప్రవీణ్ దరేకర్ ప్రకటించారు.

12 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ కి నిరసనగా మహారాష్ట్ర అసెంబ్లీ బయట బీజేపీ సభ్యుల పోటీ సెషన్ !
Bjp Mlas Parallel Assembly Session Out Side House In Maharashtra,mumbai..12 Bjp Mlas Suspension,parallel Session, Assembly,attack On Speaker Bhaskar Jadhav,speaker Bhaskar Jadhav
Follow us on

అసెంబ్లీ నుంచి తమ 12 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ కి నిరసనగా మంగళవారం మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట ‘పోటీ సభ’ (సెషన్) నిర్వహించారు. ఈ సెషన్ లో స్పీకర్ గా కాళిదాస్ కొలంబకర్ వ్యవహరిస్తారని మహారాష్ట్ర విధాన పరిషత్ లో విపక్ష నేత ప్రవీణ్ దరేకర్ ప్రకటించారు. ఓబీసీ రిజర్వేషన్ల సమస్యపై నిన్న శాసన సభలో పెద్ద ఎత్తున రభస జరిగింది. స్పీకర్ భాస్కర్ జాదవ్ ని 12 మంది బీజేపీ సభ్యులు దుర్భాషలాడి ఆయనపై చెయ్యి చేసుకున్నారు. దీంతో వారిని ఏడాది పాటు సస్పెండ్ చేశారు.వీరి దాడి దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయని మంత్రి ఛగన్ భుజ్ బల్ తెలిపారు. సభ్యుల దౌర్జన్యం కారణంగా సభ వాయిదా పడిందన్నారు. ఈ సభ్యుల సస్పెన్షన్ పై స్పందించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్..క్రమ శిక్షణారాహిత్యాన్ని సహించరాదని వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రవర్తనను శాసన సభ ఏనాడూ చూడలేదని పేర్కొన్నారు. స్పీకర్ మైక్ ని విరగగొట్టడం, ఆయనను దూషించడం ఈ రాష్ట్ర సంస్కృతి కాదు.. ఇలా ఎన్నడూ జరగలేదు అని సంజయ్ పేర్కొన్నారు.

అయితే ఇంత జరిగినా అసెంబ్లీ లో విపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ తమ ఎమ్మెల్యేలను వెనకేసుకొచ్చారు. మా పార్టీ సభ్యులు ఇలా వ్యవహరించలేదు…వీరిపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి అన్నారు. భాస్కర్ జాదవ్ చేస్తున్న ఆరోపణలు ఏకపక్షంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. కాగా 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ ని కలిసి తమ సస్పెన్షన్ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. తమ సస్పెన్షన్ అనైతికమన్నారు. ఈ మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని వారు దుయ్యబట్టారు.

మరిన్ని ఇక్కడ చూడండి : ట్రెండ్ మారింది గురు..!పెళ్ళిలో పెట్రోల్ బహుమతి..కొత్త దంపతులకు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన స్నేహితులు..(వీడియో): petrol as wedding gift video.

మెడలో నాగుపాము..సైకిల్ పై సవారీ..చుస్తే షాక్ అవుతారు..!వైరల్ అవుతున్న వీడియో..:snake on neck viral video.

తేలు విషాన్ని చిమ్మడం మీరెప్పుడైనా చూశారా? విషం చిమ్ముతున్న స్లో మోషన్ వైరల్ అవుతున్న వీడియో..:Scorpion video.

గున్న ఏనుగు చిలిపి చేష్టలు..!మట్టిలో ఎంజాయ్ చేస్తున్న ఏనుగు పిల్ల వీడియో చూసి ఫిదా అవుతున్న నీటిజన్లు..:elephant play video.