ప్లాస్మా దానం చేసిన సంబిత్ పాత్ర

| Edited By:

Jul 06, 2020 | 3:45 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏడు లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇక మరణాల సంఖ్య కూడా ఇరవై వేలకు చేరువలో ఉన్నాయి. అయితే..

ప్లాస్మా దానం చేసిన సంబిత్ పాత్ర
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏడు లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇక మరణాల సంఖ్య కూడా ఇరవై వేలకు చేరువలో ఉన్నాయి. అయితే ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ ఇంకా రాకపోవడంతో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే ఈ వైరస్‌ నుంచి రోగులను కాపాడేందుకు వైద్యులు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రాణాపాయ స్థితిలో పోరాడుతున్న కరోనా రోగులకు అత్యవసర పరిస్థితుల్లో ప్లాస్మా థెరపీతో చికిత్స చేసి బతికిస్తున్నారు. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్లాస్మా బ్యాంకులను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేత సంబిత్‌ పాత్ర హర్యానాలోని మేదాంత ఆస్పత్రిలో ప్లాస్మా దానం చేశారు. గత నెలలో ఆయన కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. ప్లాస్మా దానం చేసిన తర్వాత మాట్లాడుతూ.. గత నెలలో తాను కరోనా బారినపడి కోలుకున్నానని.. అందుకే కరోనా రోగుల కోసం.. నేడు ప్లాస్మా దానం చేశానన్నారు. కరోనా నుంచి కోలుకుని.. ఆరోగ్య వంతులంతా ప్లాస్మా దానం చేయాలని కోరారు. దీని ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు.