Lok Sabha election 2024: సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ కొత్త నినాదం.. ‘మోడీని మళ్లీ గెలిపించుకుందాం’ అంటూ జనాల్లోకి..
అయోధ్యలో బాల రామక్ విగ్రహ ప్రతిష్ఠ పూర్తి కావడంతో 2024 సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించారు మోడీ. పశ్చిమ యూపీ నుంచి ఆయన గురువారం (జనవరి 25) ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బులంద్‌షహర్‌లో బీజేపీ నిర్వహించ తలపెట్టిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు.
అయోధ్య రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కోసం ఉపవాస దీక్ష పాటించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. పూర్తిగా ఆధ్యాత్మిక యాత్రలో మునిగిపోయారు. అయోధ్యలో బాల రామక్ విగ్రహ ప్రతిష్ఠ పూర్తి కావడంతో 2024 సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించారు మోడీ. పశ్చిమ యూపీ నుంచి ఆయన గురువారం (జనవరి 25) ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బులంద్‌షహర్‌లో బీజేపీ నిర్వహించ తలపెట్టిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. మరోవైపు 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ సరికొత్త క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. Modi Ko Chunte Hain (మోడీని మళ్లీ గెలిపించుకుందాం)’ పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది బీజేపీ. దాదాపు 2 నిమిషాల 12 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో, ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన ప్రధాన విజయాలను హైలైట్ చేశారు. అలాగే వివిధ రంగాల్లో భారత్ సాధించిన ప్రగతని కళ్లకు కట్టినట్లు చూపించారు. ‘ మేము చేసేది నిజం.. కలలు కాదు. అందుకే మోడీని మళ్లీ ఎన్నుకుంటారు’ అంటూ సాగే ఈ వీడియోలో, ఉజ్వల, డీబీటీ, ప్రతి ఇంటికి కుళాయి నీరు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, మెట్రో స్టేషన్లు, ఖేలో ఇండియా, డిజిటల్ అండ్ యూపీఐ పేమెంట్స్, స్వయం ఉపాధి రంగాలు, బాలికల విద్య, చంద్రయాన్3, ఇస్రో విజయాలు, వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు, ఒప్పందాలు, బ్లాక్ మనీ కట్టడి, ఆత్మనిర్భర్ భారత్, యువకులకు స్యయం ఉపాధి అవకాశాలు, జాతీయ రహదారుల నిర్మాణం.. ఇలా గత పదేళ్ల బీజేపీ ప్రభుత్వంలో భారత్ సాధించిన అభివృద్ధిని చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
మోడీని ఎన్నుకుందాం.. బీజేపీ క్యాంపెయిన్.. వీడియో
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…