Viral: మహిళకు అక్రమ అబార్షన్.. బయటకు తీసిన పిండాన్ని పెంపుడు కుక్కకు ఆహారంగా…

స్థానిక వైద్యుడు అబార్షన్ చేయించిన తర్వాత ఆమె పరిస్థితి విషమించిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే పిండాన్ని కుక్కకు తినిపించిన అంశంపై తమకు ఎలాంటి క్లారిటీ రాలేదని.. విచారణ జరపుతున్నామని పోలీసులు చెబుతున్నారు.

Viral: మహిళకు అక్రమ అబార్షన్.. బయటకు తీసిన పిండాన్ని పెంపుడు కుక్కకు ఆహారంగా...
The doctor and his wife, both accused in the case, are now on the run (Photo: India Today)
Follow us

|

Updated on: Jan 26, 2023 | 11:57 AM

బీహార్‌లోని హాజీపూర్‌లో  దారుణ ఘటన వెలుగుచూసింది. వైద్యులు అక్రమ అబార్షన్ కారణంగా ఓ మహిళ తనువు చాలించింది. అబార్షన్ తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో తమ కుమార్తె చనిపోయిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బయటకు తీసిన పిండాన్ని.. సదరు డాక్టర్ ఇంటికి తీసుకువెళ్లి పెంపుడు కుక్కకు తినిపించాడని కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయమై వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

సదరు మహిళకు కడుపునొప్పి రావడంతో స్థానిక డాక్టర్‌ని సంప్రదించినట్లు మృతురాలి కుటుంబీకులు తెలిపారు. అబార్షన్ కోసం డాక్టర్ సూచించిన మందులు తీసుకున్న తర్వాత… పరిస్థితి మరింత దిగజారడం ప్రారంభమైందట. తరువాత గర్భస్రావం అయిందట.  “సదరు డాక్టర్ కత్తెరతో ఆపరేషన్ నిర్వహించి, పిండాన్ని బయటకు తీసి ఒక బకెట్‌లో ఉంచాడు. శిశువుకు అంత్యక్రియలు నిర్వహించమని మేము కోరాం. అతను ఏదైనా ఆధారాలు వదిలివేస్తే పోలీసులు అరెస్టు చేస్తారని చెప్పి.. అందుకు నిరాకరించాడు. తన పెంపుడు కుక్కకు పిండాన్ని తినిపిస్తానని చెప్పాడు. తాము అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పినా కానీ అతను వినలేదు” మృతుడి బంధువు ఒకరు తెలిపారు.

అబార్షన్ తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పాట్నాకు తీసుకువెళ్లారు. పదకొండు రోజుల తర్వాత ఆమె మరణించింది. డాక్టర్ చేసిన ఆపరేషన్ కారణంగా.. సదరు మహిళ అంతర్గత అవయవాలను దెబ్బతిన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  ప్రస్తుతం అబార్షన్ చేసిన డాక్టర్, అతని భార్య పరారీలో ఉన్నట్లు ఇండియా టుడే తెలిపింది. అయితే, పిండాన్ని కుక్కకు తినిపించడంపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని మహువా సబ్ డివిజనల్ పోలీసు అధికారి పూనమ్ కేస్రీ తెలిపారు. కేసు విచారణలో ఉంది. మేము వైద్య నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటున్నాము. కానీ పిండాన్ని కుక్కకు తినిపించారనే విషయంపై పూర్తి క్లారిటీ లేదని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..