
బీహార్‌లోని ఖగారియాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది.. తన భార్యను ఎత్తుకుపోయిన వ్యక్తిపై పగ తీర్చుకునేందుకు అతని భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్‌లోని ఖగారియా జిల్లాకు చెందిన నీరజ్‌కు 2009లో రూబీ దేవితో వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, నీరజ్ భార్య రూబీ దేవి.. ముఖేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇదే అంశంపై గ్రామ పంచాయితీ నిర్వహించి మరీ అనేకసార్లు పంచాయితీ పెట్టారు. అయినప్పటికీ ఇద్దరిలోనూ ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలోనే ముఖేష్, రూబీ దేవి ఫిబ్రవరి 2022లో ఇద్దరూ లేచిపోయారు. విషయం తెలుసుకున్న నీరజ్.. తన భార్యను ముఖేష్ కిడ్నాప్ చేశాడంటూ పోలీసుకు ఫిర్యాదు చేశాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. వారిద్దరూ ఇప్పటికీ దొరకలేదు. రూబీ, ముఖేష్ పారిపోయి వివాహం చేసుకున్నట్లు ఇటీవలె తెలిసిందే. ఇక ముఖేష్‌కి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఇక లాభం లేదనుకున్నాడో.. పగ పెంచుకున్నాడో గానీ.. తన భార్యను ఎత్తుకెళ్లిన ముఖేష్ భార్యను పెళ్లి చేసుకున్నాడు నీరజ్. ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటంటే.. ముఖేష్ భార్య కూడా రూబీనే. ఈ విచిత్ర పెళ్లి వార్త ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..