Lok Sabha Elections: ఎంపీగా పోటీ చేసేందుకు 60 ఏళ్ల వయసులో గ్యాంగ్‌స్టర్‌ పెళ్లి.. 17 ఏళ్ల జైలు శిక్ష తర్వాత గతేడాదే విడుదల

|

Mar 21, 2024 | 7:51 AM

90వ దశకంలో దేశ వ్యాప్తంగా మారుమ్రోగిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ అశోక్‌ మహతో పేరు మళ్లీ వార్తల్లో నిలిచింది. ఓ హత్య కేసులో 17 యేళ్ల జైలు శిక్ష అనుభవించిన మహతో గతేడాదే జైలు నుంచి విడుదలయ్యాడు. ప్రస్తుతం అతడి వయసు 60 ఏళ్లు. ఈ వయసులో అతడు పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచాడు. నిజానికి భయంకరమైన నేర చరిత్ర ఉన్న అతగాడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు..

Lok Sabha Elections: ఎంపీగా పోటీ చేసేందుకు 60 ఏళ్ల వయసులో గ్యాంగ్‌స్టర్‌ పెళ్లి.. 17 ఏళ్ల జైలు శిక్ష తర్వాత గతేడాదే విడుదల
Bihar Gangster Ashok Mahto
Follow us on

పట్నా, మార్చి 21: 90వ దశకంలో దేశ వ్యాప్తంగా మారుమ్రోగిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ అశోక్‌ మహతో పేరు మళ్లీ వార్తల్లో నిలిచింది. ఓ హత్య కేసులో 17 యేళ్ల జైలు శిక్ష అనుభవించిన మహతో గతేడాదే జైలు నుంచి విడుదలయ్యాడు. ప్రస్తుతం అతడి వయసు 60 ఏళ్లు. ఈ వయసులో అతడు పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచాడు. నిజానికి భయంకరమైన నేర చరిత్ర ఉన్న అతగాడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే అది చట్టపరంగా సాధ్యం కావడం లేదు. 2001లో నవాడా జైల్‌ బ్రేసక్‌ కేసులో మహతో దోషిగా తేలడంతో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోయాడు.

నిబంధనల ప్రకారం రెండేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడు. దీంతో ఎలాగైనా ఎన్నికల్లో పోటీ చేయాలనే తన కోరీకను ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు విన్నవించాడు. లాలూ సలహాతో పెళ్లి చేసుకుని, పోటీలో భార్యను నిలబెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తాజాగా అనిత (46) అనే మహిళను అతడు వివాహం చేసుకున్నాడు. ఇక తన భార్యను ఆర్జేడీ తరఫున ఎన్నికల బరిలోకి దింపేయత్నంలో ఉన్నట్లు స్థానిక మీడయా కథనాలు వెల్లడించాయి.

అసలు ఎవరీ అశోక్‌ మహతో?

బీహార్‌లోని నవాదా జిల్లాలోని కోనన్‌పుర్‌ గ్రామానికి చెందిన అశోక్‌ మహతో అనే గ్యాంగ్‌స్టర్‌.. షేక్‌పురా జేడీయూ నేత, ఆరుసార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు ఎంపీగా ఎన్నికైన రణధీర్ కుమార్ సోనీ హత్యాయత్నం, అలాగే నవాదా జైలు బద్దలుగొట్టిన కేసులో నేరస్థుడిగా రుజువైంది. దీంతో 17ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. సరైన సాక్ష్యాధారాలు లేనికారణంగా 2023లో అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. లాలూ సూచనతో అనిత అనే మహిళను మంగళవారం రాత్రి తన మద్దతుదారుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. ఇక తన భార్య అనితను ముంగేర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా బరిలోకి దింపబోతున్నట్లు రాజకీయ ఊహాగానాలు జోరందుకున్నాయి. తన భార్య ద్వారా మహతో రాజకీయంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.