Deputy CM: ‘ఏ పార్టీ నాయకులైనా.. ఈ వైఖరిని మానుకోవాలి’.. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ హితవు..

దేశంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు నాయకులు చేస్తున్న కామెంట్స్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి గిరిధర్ సింగ్ జేడీయూ, ఆర్జేడీ కలిసిపోతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిని లాలు ప్రసాద్ యాదవ్ తీవ్రంగా ఖండించారు.

Deputy CM: ఏ పార్టీ నాయకులైనా.. ఈ వైఖరిని మానుకోవాలి.. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ హితవు..
Tejaswi Yadav

Updated on: Dec 24, 2023 | 8:33 PM

దేశంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు నాయకులు చేస్తున్న కామెంట్స్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి గిరిధర్ సింగ్ జేడీయూ, ఆర్జేడీ కలిసిపోతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిని లాలు ప్రసాద్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఇదే నేపథ్యంలో ‘హిందీ మాట్లాడే వారు తమిళనాడులో మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నారని’ డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌ చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ స్పందించారు. మారన్ చేసిన చౌకబారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వివిధ రాష్ట్రాలలోని ఏ పార్టీకి చెందిన నాయకులైనా ఇలాంటి కించపరిచే మాటలు మాట్లాడటం సరైన పద్దతి కాదన్నారు. ఈ వైఖరి మానుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల ప్రజలను, నాయకులను, పార్టీలను మేం గౌరవిస్తామని తెలిపారు.

ఇదిలా ఉంటే తేజస్వీ యాదవ్ కామెంట్స్‎పై డీఎంకే వర్గాలు స్పందించాయి. తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న దయానిధి మారన్ వీడియో పాతదని తెలిపారు ఆ పార్టీకి చెందిన నాయకులు. తమిళనాడులో వరదలు ముంచెత్తాయని అవసరమైన మేరకు సాయం అందించడంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విఫలమయ్యారని విమర్శించారు. అందుకే బీజేపీకి చెందిన పలువురు ఈ వీడియోని వైరల్ చేసి విషయాన్ని పక్కదారి పట్టేలా చేస్తున్నారని ఆరోపించారు. అయితే దీనిపై రాహుల్ గాంధీ, నితీష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలని బీజేపీ నేత అమిత్ మాల్వియా తన ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న డీఎంకే నేతలు ఇలా మాట్లాడటంపై తమ వైఖరి ఏంటో వ్యక్తం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో డీఎంకే ఎంపీ మారన్ చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమికి బీటలు వారేలా ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..