Bihar Election Results: బీహార్‌లో దూసుకుపోతున్న ఎన్డీఏ కూటమి.. 2 స్థానాల్లో ఎంఐఎం ముందంజ.. లేటెస్ట్ ట్రెండ్స్ ఇవే..
బిహార్ అసెంబ్లీ ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. 243 స్థానాలకు జరుగుతున్న లెక్కింపులో విజేత ఎవరన్నది దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నిక కౌంటింగ్‌ను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు ఎన్నికల అధికారులు. బిహార్ వ్యాప్తంగా నిఘా నీడలో లెక్కింపు కొనసాగుతోంది. ఎన్డీఏ (బీజేపీ+జేడీయూ), మహాఘట్‌బంధన్ (ఆర్జేడీ+కాంగ్రెస్) మధ్య గట్టి పోటి నెలకొంది.

బిహార్ అసెంబ్లీ ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. 243 స్థానాలకు జరుగుతున్న లెక్కింపులో విజేత ఎవరన్నది దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నిక కౌంటింగ్‌ను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు ఎన్నికల అధికారులు. బిహార్ వ్యాప్తంగా నిఘా నీడలో లెక్కింపు కొనసాగుతోంది. ఎన్డీఏ (బీజేపీ+జేడీయూ), మహాఘట్‌బంధన్ (ఆర్జేడీ+కాంగ్రెస్) మధ్య గట్టి పోటి నెలకొంది. బిహార్‌లో NDA ఆధిక్యం మ్యాజిక్ ఫిగర్ దాటింది.
243 అసెంబ్లీ స్థానాల్లో.. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం..
ఎన్డీఏ (బీజేపీ+జేడీయూ) -124
మహాఘట్‌బంధన్ (ఆర్జేడీ+కాంగ్రెస్) -104
ఎంఐఎం – 2
జన్ సూరజ్ పార్టీ -4
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ధీమాతో విజయోత్సవాలకు ఇప్పటినుంచే సిద్ధమవుతోంది. ఢిల్లీ BJP కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలకు పంచేందుకు స్వీట్లు సిద్ధం చేస్తోంది.
మహాఘట్‌బంధన్ కూటమి సైతం గెలుపు ధీమాతో ఉంది. గెలుపు సంబరాల్లో భాగంగా కార్యకర్తలకు పంచేందుకు మకామాలో RJD ఆధ్వర్యంలో స్వీట్లు తయారు చేస్తున్నారు.




