బీహార్‌ మహాఘట్‌బంధన్‌లో తేలని సీట్ల లెక్క.. కూటమి సీఎం అభ్యర్ధి ఎవరంటే?

బీహార్‌ మహాఘట్‌బంధన్‌ కూటమిలో సీట్ల పంచాయితీ కొనసాగుతోంది. 12 నియోజకవర్గాల్లో ఫ్రెండ్లీ ఫైట్‌ కూటమి పార్టీలను కలవరపెడుతోంది. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌, ఆర్జేడీ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచార వ్యూహంపైనా గందరగోళం నెలకొంది. ఎవరికివారు అభ్యర్థుల జాబితాలు విడుదల చేయడంతో సంక్షోభం ముదిరింది.

బీహార్‌ మహాఘట్‌బంధన్‌లో తేలని సీట్ల లెక్క.. కూటమి సీఎం అభ్యర్ధి ఎవరంటే?
Bihar Assembly Election 2025

Updated on: Oct 22, 2025 | 5:46 PM

బీహార్‌ మహాఘట్‌బంధన్‌ కూటమిలో సీట్ల పంచాయితీ కొనసాగుతోంది. 12 నియోజకవర్గాల్లో ఫ్రెండ్లీ ఫైట్‌ కూటమి పార్టీలను కలవరపెడుతోంది. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌, ఆర్జేడీ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచార వ్యూహంపైనా గందరగోళం నెలకొంది. ఎవరికివారు అభ్యర్థుల జాబితాలు విడుదల చేయడంతో సంక్షోభం ముదిరింది. పాట్నాలో ఆర్జేడా నేతలతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌ సమావేశమయ్యారు. అయినప్పటికి సీట్ల పొత్తుపై క్లారిటీ రాలేదు.

తనను మహాఘట్‌బంధన్‌ కూటమి సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని కాంగ్రెస్‌ నేతలను డిమాండ్‌ చేశారు తేజస్వియాదవ్‌. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్‌ నేతలు ఒప్పుకున్నారు. మహాఘట్‌బంధన్‌ కూటమి సీఎం అభ్యర్ధిగా తేజస్వియాదవ్‌ పేరును గురువారం ప్రకటించబోతున్నారు. అయితే మహాఘట్‌బంధన్‌ ఐక్యంగా ఉందని అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. ఏడు సీట్లలో ఫ్రెండ్లీ ఫైట్‌తో ఇబ్బంది లేదన్నారు. రేపటిలోగా అన్ని విషయాలపై క్లారిటీ వస్తుందన్నారు. గురువారం మహాఘట్‌బంధన్‌ కూటమి నేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేయబోతున్నారు. తేజస్వియాదవ్‌ను మహాఘట్‌బంధన్‌ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించబోతున్నారు.

మరోవైపు ఎన్డీఏ కూటమికి దీటుగా తేజస్వి యాదవ్‌ హామీలు ఇస్తున్నారు. మహిళా ఓటర్లే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. బేటీ-మా యోజన పేరుతో బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ చేశారు తేజస్వి యాదవ్‌. అర్హులైన మహిళలకు ఉద్యోగాలతో పాటు నెలకు రూ.30వేలు జీతం ఇస్తామన్నారుఉ మహిళలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు తేజస్వి యాదవ్‌. మహిళల కోసం మనీ స్కీమ్స్‌, రుణాలు అందిస్తామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..