వర్షాల వల్ల 174 మంది మృతి..!

| Edited By:

Jul 24, 2019 | 4:32 PM

ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బీహార్, హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో.. నదులు ఉప్పొంగాయి. వర్షాల ధాటికి పలుచోట్ల కొండచరియలు విరిగిపడతున్నాయి. వరదల కారణంగా అసోం, బీహార్‌లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటిదాకా.. 174 మంది వరకూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలు, వరదలు దాదాపు కోటీ పది లక్షల మందిపై ప్రభావం చూపాయి. కాగా.. ఇటు ముంబైలో మరోసారి భారీ వర్షాలు భయపెడుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ […]

వర్షాల వల్ల 174 మంది మృతి..!
Follow us on

ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బీహార్, హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో.. నదులు ఉప్పొంగాయి. వర్షాల ధాటికి పలుచోట్ల కొండచరియలు విరిగిపడతున్నాయి. వరదల కారణంగా అసోం, బీహార్‌లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటిదాకా.. 174 మంది వరకూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలు, వరదలు దాదాపు కోటీ పది లక్షల మందిపై ప్రభావం చూపాయి.

కాగా.. ఇటు ముంబైలో మరోసారి భారీ వర్షాలు భయపెడుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తోన్నాయి. రానున్న మరో 24 నుంచి 36 గంటల్లో ముంబైలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ వర్షానికి రైల్వే ట్రాక్‌లు, రోడ్లు పూర్తి జలమయం అయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు, లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గుతోంది. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పటికే రంగంలో దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

అటు బీహార్‌లోనూ గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా.. కురుస్తున్న వర్షాలకు సుమారు 106 మంది చినిపోయినట్లు తెలుస్తోంది. పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 50.5 లక్షల మందిని సహాయ పునరావాస శిబిరాలకు తరలించారు.