AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఎఫైర్’ పెట్టుకుందని.. కుక్కను వదిలేశాడు

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఓ పెంపుడు కుక్క.. పక్కింటి కుక్కతో అక్రమ సంబంధం పెట్టుకుందని.. సదరు యజమాని ఆ మూడేళ్ళ నోరులేని జీవాన్ని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి వీధిలో వదిలేశాడు. ఈ చిత్రమైన ఘటన కేరళలోని తిరువనంతపురం చకాయి వరల్డ్ మార్కెట్ పరిసరాల్లో చోటు చేసుకుంది. రోడ్డు మీద ఉన్న ఆ కుక్క మెడలో ఓ నోట్ కూడా ఉండడం విశేషం. ‘నిజానికి ఇది చాలా మంచి కుక్క. యజమానిని ఎటువంటి ఇబ్బంది పెట్టదు. ఎప్పుడూ కూడా […]

'ఎఫైర్' పెట్టుకుందని.. కుక్కను వదిలేశాడు
Ravi Kiran
|

Updated on: Jul 24, 2019 | 4:36 PM

Share

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఓ పెంపుడు కుక్క.. పక్కింటి కుక్కతో అక్రమ సంబంధం పెట్టుకుందని.. సదరు యజమాని ఆ మూడేళ్ళ నోరులేని జీవాన్ని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి వీధిలో వదిలేశాడు. ఈ చిత్రమైన ఘటన కేరళలోని తిరువనంతపురం చకాయి వరల్డ్ మార్కెట్ పరిసరాల్లో చోటు చేసుకుంది. రోడ్డు మీద ఉన్న ఆ కుక్క మెడలో ఓ నోట్ కూడా ఉండడం విశేషం.

‘నిజానికి ఇది చాలా మంచి కుక్క. యజమానిని ఎటువంటి ఇబ్బంది పెట్టదు. ఎప్పుడూ కూడా అనారోగ్యానికి గురి కాలేదు. ప్రతి ఐదు రోజులకోసారి స్నానం చేస్తుంది. కేవలం పాలు, బిస్కెట్లు, కోడిగుడ్లు మాత్రమే తీసుకుంటుంది. మూడేళ్ల కాలంలో ఒక్కరిని కూడా కరవలేదు. కానీ ఇది కొద్దిరోజులుగా పక్కింటి కుక్కతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో దాని ప్రవర్తనలో మార్పు వచ్చింది. అందుకే ఈ పెంపుడు కుక్కను బయటకు పంపించానని’ సదరు యజమాని ఆ నోట్‌లో పేర్కొన్నాడు.

ఇక ఈ విషయం పీపుల్‌ ఫర్‌ ఏనిమల్‌ వాలంటరీ శామీన్‌‌కు తెలియడంతో అక్కడికి వచ్చి.. ఆ కుక్కను హోమ్‌కు తీసుకెళ్లారు. అనారోగ్యానికి గురైనప్పుడు కుక్కలను బయటకు వదిలేయడం చూశాం.. కానీ అక్రమ సంబంధం పేరిట కుక్కలను వదిలేయడం ఎప్పుడూ చూడలేదని శామీన్‌ తెలిపారు.

Follow Us
ఇవాళే OTTకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా.. IMDBలో 8.7 రేటింగ్
ఇవాళే OTTకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా.. IMDBలో 8.7 రేటింగ్
నిగనిగలాడుతున్నాయని కొంటున్నారా?.. ఈ సింపుల్ టెస్టులతో నకిలీకి చె
నిగనిగలాడుతున్నాయని కొంటున్నారా?.. ఈ సింపుల్ టెస్టులతో నకిలీకి చె
పారిశుధ్య కార్మికులకు రూ.2 లక్షల జీతం! మన రాష్ట్రంలోనే..
పారిశుధ్య కార్మికులకు రూ.2 లక్షల జీతం! మన రాష్ట్రంలోనే..
ఈ చార్జీలు ఉండవు.. బ్యాంకుల కస్టమర్లకు ఆర్బీఐ శుభవార్త
ఈ చార్జీలు ఉండవు.. బ్యాంకుల కస్టమర్లకు ఆర్బీఐ శుభవార్త
డైటింగ్ చేస్తున్నారా?.. ఆకలిని చంపి, ఎనర్జీనిచ్చే పవర్ఫుల్ స్నాక్
డైటింగ్ చేస్తున్నారా?.. ఆకలిని చంపి, ఎనర్జీనిచ్చే పవర్ఫుల్ స్నాక్
అయ్యబాబోయ్.. 2026 చివరి నాటికి ఊహించని రేంజ్‌కు బంగారం ధర..?
అయ్యబాబోయ్.. 2026 చివరి నాటికి ఊహించని రేంజ్‌కు బంగారం ధర..?
15 నెలల సంజనకు కొత్త కుటుంబం,శిశు సంక్షేమంలో కోనసీమ కొత్త అధ్యాయం
15 నెలల సంజనకు కొత్త కుటుంబం,శిశు సంక్షేమంలో కోనసీమ కొత్త అధ్యాయం
అప్పట్లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. 25 ఏళ్లుగా సినిమాలకు దూరం
అప్పట్లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. 25 ఏళ్లుగా సినిమాలకు దూరం
ఉదయం లేట్‌గా నిద్రలేచిన స్టూడెంట్.. కట్ చేస్తే ఊహించని షాక్..
ఉదయం లేట్‌గా నిద్రలేచిన స్టూడెంట్.. కట్ చేస్తే ఊహించని షాక్..
ఫ్లైట్ టికెట్ రూల్స్‌లో మార్పులు.. కొత్త నిబంధనలు ఇవే..
ఫ్లైట్ టికెట్ రూల్స్‌లో మార్పులు.. కొత్త నిబంధనలు ఇవే..