Fake Remdesivir: నకిలీ రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌లను విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు

|

May 08, 2021 | 2:24 PM

Fake Remdesivir: కరోనా చికిత్సలో ఉపయోగపడే రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌ ఎంతో కొరత ఉంది. ఇదే అదనుగా భావించి కొందరు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు...

Fake Remdesivir: నకిలీ రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌లను విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు
Fake Remdesivir
Follow us on

Fake Remdesivir: కరోనా చికిత్సలో ఉపయోగపడే రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌ ఎంతో కొరత ఉంది. ఇదే అదనుగా భావించి కొందరు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కరోనా చికిత్సలో అత్యవసరమని చెబుతున్నారు వైద్యులు. అయితే ఈ ఇంజెక్షన్‌ కొరత తీవ్రంగా ఉండటంతో కొందరు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు కూడా చేపడుతున్నారు పోలీసులు. వెయ్యి రూపాయల లోపు ఉండే ఈ రెమిడెసివిర్‌.. వేలల్లో విక్రయిస్తున్నారు. ఇదిలా ఉంటే నకిలీ రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌లను కూడా తక్కువ ధరకు విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడింది ఓ ముఠా. వ్యాపారాన్ని పెంచుకునేందుకు కొందరు నకిలీ ఇంజెక్షన్లను తీసుకువచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఢిల్లీ నుంచి నేపాల్‌ సరిహద్దు వరకు చాలా మంది ఇలాంటి నకిలీ రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు విక్రయిస్తున్నారు. అయితే భారత్ లో నకిలీ రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ఓ ముఠాను నేపాల్‌ మొరాంగ్‌ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. అయితే 90 రూపాయల విలువ చేసే యాంటీ బయోటిక్ ఇంజక్షన్ కు రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌ కు సంబంధించిన లేబుల్‌ అతికించి విక్రయిస్తున్నారు.

ఈ ఇంజెక్షన్‌ 7 నుంచి 25 వేల వరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.  అయితే ఢిల్లీ -నేపాల్‌ సరిహద్దులో ఇలాంటి ముఠాలు కనిపిస్తున్నాయి. నేపాల్‌ సరిహద్దులో ఉండే బీహార్‌ రాష్ట్రంలో ఈ ముఠా సంచరిస్తూ రెమిడెసివిర్‌ పేరుతో నకిలీ ఇంజెక్షన్లను విక్రయిస్తోంది. అయితే భారత్‌లో ఈ రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లకు డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో నకిలీ ముఠా భారత సరిహద్దు ప్రాంతాల్లో తిరుగుతూ నకిలీ రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లను విక్రయిస్తూ మోసగిస్తోంది. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే నేపాల్‌లోని విరాత్‌నగర్‌లోని మౌరాంగ్‌ జిల్లా కు ఔషధ దుకాణ దారుడు ఈ నకిలీ రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న పోలీసులు గుర్తించారు. అయితే ఈ ముఠాలో బీహార్‌లోని అరియారియా జిల్లాకు చెందిన వారున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత దర్యాప్తు జరపాలని ఖట్మండ్‌ పోలీసు ప్రధాన కార్యాలయం భారత ఉన్నత స్థాయి పోలీసులకు లేఖ రాసినట్లు నేపాల్‌ పోలీసులు వర్గాలు తెలిపాయి. నేపాల్‌లో తయారైన ఈ నకిలీ ఇంజెక్షన్లను భారత్‌లో విక్రయిస్తూ మోసగిస్తున్నట్లు పోలీసులు తేల్చారు.

ఇవీ కూడా చదవండి:

THIRD-WAVE TENSION: ఇండియాకు థర్ద్ వేవ్ టెన్షన్.. సెకెండ్ వేవే ఇంత భయంకరమైతే మరి మూడోది?

India Corona: దేశంలో భయపెడుతున్న కరోనా మహమ్మారి.. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు..మరణాలు