Gujarat Bank Fraud: దేశంలో బ్యాంకుల కుంభకోణాలకు తెరబడేలా లేదు. మొన్న ఆప్కాబ్, నిన్న మహేశ్ బ్యాంక్, తాజాగా ఎస్‌బీఐ. బ్యాంకులనే టార్గెట్ చేస్తూ వేలకోట్లు కొట్టేస్తున్నారు కేటుగాళ్లు. దేశంలో బ్యాంకులను మోసం చేసిన వేల కోట్లు కొట్టేసిన ఘనులు విదేశాలకు పారిపోయారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వజ్రాల వ్యాపారి రూ.13 వేల కోట్ల కుచ్చుటోపీ వేశాడు. కొత్తగా మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఒక బ్యాంకో రెండు బ్యాంకులో కాదు ఏకంగా ఐదుబ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టారు. తమ సంస్థకున్న పలుకుబడిని వాడుకుని బ్యాంకుల నుంచి వేల కోట్లు రుణం తీసుకున్నారు. ఆ నిధులను ఇతర కార్యకాలాపాలకు వినియోగిస్తూ ఘరానా మోసానికి తెరదీశారు. గుజరాత్‌కు చెందిన ప్రముఖ షిప్‌యార్డ్ సంస్థ ఏబీజీ మొత్తం 28 బ్యాంకులను మోసం చేసి 22,842 కోట్లు కొల్లగొట్టినట్టు సీబీఐ కేసు నమోదయ్యింది. ఏబీజీ షిప్‌యార్డ్, ఆ సంస్థ డైరెక్టర్లు రిషి అగర్వాల్, సంతానం ముత్తుస్వామి, అశ్విని కుమార్‌లు మోసపూరితంగా వేల కోట్ల రుణాలు పొందినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నౌకా నిర్మాణం, మరమ్మతులను చేసే ఏబీజీ గ్రూప్.. గుజరాత్‌లోని దహేజ్, సూరత్‌లో షిప్‌యార్డులను నిర్వహిస్తోంది. ఇప్పటి వరకూ 165కిపైగా నౌకలను నిర్మించింది ఈ సంస్థ.
సీబీఐకి భారతీయ స్టేట్ బ్యాంకు చేసిన ఫిర్యాదు ప్రకారం.. ఎస్బీఐ నుంచి 2,925 కోట్లు, ఐసీఐసీఐ నుంచి 7,089 కోట్లు, ఐడీబీఐ నుంచి 1,614 కోట్లు, బ్యాంకు ఆఫ్ బరోడా 1,244 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి 1,228 కోట్ల మోసపూరితంగా రుణాలు పొందింది. ఫోరెన్సిక్ ఆడిట్ 2019 జనవరి 18న నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 2012 నుంచి జూలై 2017 వరకు నిందితులంతా కుమ్మక్కయి నిధుల మళ్లించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారు. బ్యాంకుల ద్వారా ఇతర ప్రయోజనాల కోసం నిధులను వినియోగించారని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించింది.
Also read:
Gold Silver Price Today: మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.50 వేల మార్క్ దాటి..