Tamilnadu Elections: తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. సంచలన ప్రకటన చేసిన చిన్నమ్మ శశికళ..

| Edited By: Ravi Kiran

Mar 03, 2021 | 10:10 PM

VK Sasikala: ఎన్నికలు సమిపిస్తున్న తరుణంలో తమిళనాటు ఊహించని ఘటన చోటు చేసుకుంది.

Tamilnadu Elections: తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. సంచలన ప్రకటన చేసిన చిన్నమ్మ శశికళ..
Follow us on

VK Sasikala: ఎన్నికలు సమిపిస్తున్న తరుణంలో తమిళనాటు ఊహించని ఘటన చోటు చేసుకుంది. అన్నాడీఎంకే బృహిష్కృత నాయకురాలు శశికళ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితులలో రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగుతునట్టు ప్రకటించారు. అన్నాడీఎంకే కార్యకర్తలు ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. డీఎంకే కుటుంబపాలన తమిళనాడు రాష్ట్రంలో రాకుండా అమ్మ పాలన కోసం పోరాడాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

కాగా, అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన శశికళ జనవరిలో విడుదల అయ్యారు. ఆ తరువాత ఫిబ్రవరి 8న ఆమె బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చారు. దాదాపు నాలుగేళ్ల తరువాత తమిళనాడు గడ్డపై అడుగు పెట్టిన శశికళ.. వస్తూనే పెను రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. తానే జయలలిత వారుసురాలిని అంటూ ఉద్ఘాటించారు. తాను రాజకీయాల్లో వస్తున్నానని, ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. శశికళ చేసిన ఆ ఒక్క ప్రకటన.. తమిళనాడు రాజకీయాల్లో అమాంతం హీట్ పెంచేసింది. ఇంతకాలం అన్నాడీఎంకేలోని శశికళ వ్యతిరేక శిబిరం, శశికళ మధ్య రాజకీయ యుద్ధమే కొనసాగింది. ఇలాంటి తరుణంలో శశికళ తాజా ప్రకటన తమిళనాట మరో సంచలనం సృష్టించింది. తాను రాజకీయాల్లోంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. అధికారం కోసం ఊహించని రీతిలో క్యాంప్ రాజకీయాలు నిర్వహించిన శశిళక, ఇప్పుడు ఇలా ఉన్నపళంగా తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పడం అందరినీ షాక్‌కు గురి చేసింది.

Also read:

Covid Vaccine: కరోనా వ్యాక్సిన్‌పై సందేహాలను పటాపంచలు చేసిన వందేళ్ల హైదరాబాదీ.. శభాష్ అంటున్న వైద్యులు..

తమిళనాట రాజుకున్న ఎన్నికల వేడి.. పోటా పోటీ ప్రచారాలతో నేతల జోరు.. మహిళల ఓట్లపైనే కమల్‌హాసన్‌ గురి

Haj Committee of India: హజ్ యాత్రకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా?.. భారత ప్రభుత్వం విడుదల చేసిన ఈ కీలక అంశాలు మీకోసమే..