Gujarat: ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్.. వరసగా రెండోసారి.. హాజరు కానున్న ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. మరోసారి అధికారం చేపట్టేందుకు సిద్దమైంది. ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ను నియమించేందుకు పార్టీ అధిష్ఠానం అంగీకరించింది....

Gujarat: ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్.. వరసగా రెండోసారి.. హాజరు కానున్న ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు..
Bhupendra Patel
Follow us

|

Updated on: Dec 12, 2022 | 7:43 AM

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. మరోసారి అధికారం చేపట్టేందుకు సిద్దమైంది. ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ను నియమించేందుకు పార్టీ అధిష్ఠానం అంగీకరించింది. ఈ మేరకు సీఎం గా ఇవాళ ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి.. ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అహ్మదాబాద్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రధానిని చూసేందుకు ప్రజలు బారులు తీరారు. ప్రధానమంత్రి కరచాలనం చేస్తూ ప్రజలకు అభివాదం చేశారు. దీంతో ప్రజలు మోదీ-మోదీ అంటూ నినాదాలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పటేల్‌కు ఇది వరసగా రెండోసారి. గాంధీనగర్‌లోని కొత్త సచివాలయం సమీపంలోని హెలిప్యాడ్ మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు గవర్నర్ ఆచార్య దేవవ్రత్ చేతుల మీదుగా రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా పటేల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పటేల్‌తో పాటు మరికొందరు కొత్త మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

ఇటీవల ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 182 స్థానాలకు గానూ బీజేపీ 156 సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఇది వరుసగా ఏడో విజయం. కాంగ్రెస్ 17 స్థానాలు, ఆప్ ఐదు స్థానాలు గెలుచుకోగా.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసేందుకు పటేల్ తన మొత్తం మంత్రివర్గంతో రాజీనామా చేశారు. శనివారం ఆయన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. ఆయన గవర్నర్‌ను కలిసి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఘట్లోడియా స్థానంలో తన ప్రత్యర్థిపై పటేల్ 1.92 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత ఏడాది సెప్టెంబరులో విజయ్ రూపానీ రాజీనామా చేయడంతో పటేల్ గుజరాత్ పగ్గాలు చేపట్టాడు.

కాగా.. మంత్రి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు బీజేపీలో తీవ్ర సమాలోచనలు సాగుతున్నాయి. కుల, ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని సమతూకం చేసేందుకు ఆ పార్టీ బలపడాల్సి ఉంది. ఎమ్మెల్యేలు కాను దేశాయ్, రాఘవ్‌జీ పటేల్, హృషికేష్ పటేల్, హర్ష్ శాంఘ్వీ, శంకర్ చౌదరి, పూర్ణేశ్ అశావహుల్ లిస్ట్ లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.