CM KCR: బీఆర్ఎస్ విస్తరణకు మరో ముందడుగు.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్..

|

Feb 27, 2023 | 9:07 AM

దేశ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ను స్థాపించినట్టు చెబుతున్న అధినేత కేసీఆర్‌.. పార్టీ విస్తరణపై దృష్టిసారించారు.

CM KCR: బీఆర్ఎస్ విస్తరణకు మరో ముందడుగు.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్..
Cm Kcr
Follow us on

బీఆర్‌ఎస్‌ మహారాష్ట్ర కిసాన్‌సెల్‌ అధ్యక్షుడిగా మాణిక్‌ కదమ్‌ ను ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ నియమించారు. దేశ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ను స్థాపించినట్టు చెబుతున్న అధినేత కేసీఆర్‌.. పార్టీ విస్తరణపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఈ నెల 6న మహారాష్ట్రలోని నాందేడ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తాజాగా మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడిగా మాణిక్‌ కదమ్‌ను నియమించారు. ఈ మేరకు నిన్న ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడిగా జాతీయ రైతు సంఘం నేత గుర్నాంసింగ్‌ చడూనీని నియమించిన విషయం తెలిసిందే. కాగా, మహారాష్ట్రలోని ముంబైలో కల్వకుంట్ల కవిత శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర అభివృద్ధిలో బీఆర్‌ఎస్‌ పార్టీ కీలక భాగస్వామి అవుతుందని చెప్పారు. ఇక్కడి ప్రజల కోసం తాము పనిచేస్తామని ప్రకటించారు.

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినప్పటి నుండి కేసీఆర్ పూర్తిగా దేశ రాజకీయాలపై దృష్టి సారించారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశం దృష్టిని ఆకర్షించే యత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడి నియామకం ఒకటిగా చెబుతున్నారు. మొదట తెలంగాణ చుట్టూ ఉన్న రాష్ట్రాలపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు.

మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలు విస్తరించేలా ప్రణాళికలు రచిస్తోంది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్. ఇందులో భాగంగా పార్టీ కార్యకలాపాలకు కార్యాలయాలను సిద్ధం చేస్తూ రాష్ట్రాల బాధ్యతలను పలువురికి అప్పగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..