Threat Calls: రోజులు లెక్కపెట్టుకో.. నిన్ను చంపేస్తాం.. ఉద్యమ నేతకు అగంతకుల వార్నింగ్..!

|

Dec 06, 2021 | 9:37 AM

Rakesh Tikait : దేశంలో రోజురోజుకూ బెదిరింపుల కల్చర్‌ పెరిగిపోతోంది. ప్రజల పక్షాన పోరాడే నేతలకు చంపేస్తామనే బెదిరింపు కాల్స్‌ సర్వసాధారణంగా మారాయి.

Threat Calls: రోజులు లెక్కపెట్టుకో.. నిన్ను చంపేస్తాం.. ఉద్యమ నేతకు అగంతకుల వార్నింగ్..!
Rakesh Tikait
Follow us on

Rakesh Tikait : దేశంలో రోజురోజుకూ బెదిరింపుల కల్చర్‌ పెరిగిపోతోంది. ప్రజల పక్షాన పోరాడే నేతలకు చంపేస్తామనే బెదిరింపు కాల్స్‌ సర్వసాధారణంగా మారాయి. తాజాగా భారతీయ కిసాన్​యూనియన్​నేత రాకేశ్​టికాయిత్‌కు మరోసారి బెదిరింపు కాల్స్​వచ్చాయి. దీనిపై ఘజియాబాద్‌లోని కౌశాంబి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు. ఫోన్​కాల్​ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు అధికారులు. టికాయిత్ భద్రతలో ఉన్న ఉత్తరప్రదేశ్​పోలీసు సిబ్బంది నితిన్‌కు ఈ ఫోన్​కాల్​వచ్చినట్లు చెబుతున్నారు పోలీసులు. దుండగుడు మొదట అసభ్యంగా మాట్లాడి, ఆపై చంపేస్తానని బెదిరించాడని వివరించారు అధికారులు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీస్‌స్టేషన్‌ ఇన్‌ఛార్జీ సచిన్​మాలిక్ తెలిపారు. ఆడియో క్లిప్‌ను టికాయిత్ ద్వారా అందుకొని, దాని ఆధారంగా తదుపరి విచారణ జరుపుతామని వెల్లడించారు.

కాగా, టికాయిత్‌కు గతంలోనూ పలుమార్లు ఇదే తరహాలో బెదిరింపులు వచ్చాయి. మరో బీకేయూ నేత, టికాయిత్​ సన్నిహితుడు జయ మాలిక్​హత్య కుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఘాజీపుర్ సరిహద్దులో టికాయిత్​నిర్వహిస్తున్న ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు మాలిక్.​ఆయన్ను హత్య చేసేందుకు ప్రయత్నించిన కిషోర్, సోనూలను అరెస్ట్​చేశారు పోలీసులు. ఈనెల 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వ్చచింది. ఈ ఇష్యూలో మోదీనగర్‌కు చెందిన వీర్‌సేన్, సంజయ్‌ ప్రధాన్​కుట్ర పన్నినట్లు తెలిపారు అధికారులు. రూ. 10 లక్షల సుపారీ ఇచ్చారని వెల్లడించారు పోలీసులు. నిందితులను రెండు రోజుల క్రితం భోజ్‌పుర్‌లో పట్టుకున్నట్టు తెలుసుస్తోంది. అటు టికాయత్‌ ఇష్యూపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రైతులు. నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు.

Also read:

Ram charan & Upasana: దోమకొండ కోటలో ఘనంగా పెళ్లి వేడుకలు.. సందడి చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఫోటోస్ వైరల్..

Greta E Scooters: బడ్జెట్ ధరల్లో గ్రేటా ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు..!(వీడియో)

Omicron Variant-Third Wave: భారత్ లో ఒమిక్రాన్ విలయతాండవం.. అలెర్ట్ ప్రకటించిన ప్రభుత్వం..(వీడియో)