Gujarat New CM: గుజరాత్‌లో రాజకీయ ఉత్కంఠకు తెర.. కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్

గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. గుజరాత్ మాజీ సీఎం

Gujarat New CM: గుజరాత్‌లో రాజకీయ ఉత్కంఠకు తెర.. కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్
Bhupendra Patel
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 12, 2021 | 5:37 PM

Bhupendra Patel: గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. గుజరాత్ మాజీ సీఎం ఆనంది బెన్ పటేల్ వర్గానికి చెందిన నేత భూపేంద్ర పటేల్. ప్రస్తుతం భూపేంద్ర పటేల్ ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గుజరాత్ తదుపరి సీఎంగా భూపేంద్ర పటేల్​ను ఎంపిక చేసిన బీజేపీ అధిష్టానం.. విజయ్​ రూపానీ స్థానాన్ని భూపేంద్రతో భర్తీ చేసింది. ఇవాళ గాంధీనగర్‌లో జరిగిన సమావేశంలో పటేల్‌ను శాసనపక్ష నేతగా ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. త్వరలో ఆయన ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

దీంతో గుజరాత్ లో నిన్నటి నుంచి నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడినట్లైంది. గాంధీనగర్​లో ఇవాళ జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో భూపేంద్ర పేరును మాజీ సీఎం విజయ్ రూపానీ ప్రతిపాదించారు. పార్టీ అధిష్ఠానం పంపించిన పరిశీలకులు.. నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్​ జోషి సమక్షంలో శాసనసభాపక్ష నేతగా భూపేంద్ర పటేల్​ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పార్టీ ఎమ్మెల్యేలు. కాగా, గుజరాత్​ సీఎంగా విజయ్​ రూపానీ శనివారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో గుజరాత్‌లో నిన్నటి నుంచి రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. రూపానీ వారసుడెవరు? సీఎం పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారు? అని సర్వత్రా చర్చలు జరిగాయి. దీనికి ముగింపు పలుకుతూ భూపేంద్ర పటేల్​ను తదుపరి సీఎంగా ప్రకటించింది బీజేపీ. 55ఏళ్ల భూపేంద్ర.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘట్లోడియా నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

Read also: Somu Veerraju: మత్స్యకారులను పాలగాళ్ళెగా మార్చే కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది: సోము వీర్రాజు