Bharat Jodo Yatra: 4వ రోజు కొనసాగుతున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర.. భారీ బందోస్తు

Bharat Jodo Yatra: రాహుల్‌గాంధీ పాదయాత్ర 4వ రోజు ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇవాళ మాలగం నుంచి మొదలైన భారత్‌ జోడో యాత్ర.. సాయంత్రానికి కేరళలోకి..

Bharat Jodo Yatra: 4వ రోజు కొనసాగుతున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర.. భారీ బందోస్తు
Bharat Jodo Yatra
Follow us
Subhash Goud

|

Updated on: Sep 10, 2022 | 8:50 AM

Bharat Jodo Yatra: రాహుల్‌గాంధీ పాదయాత్ర 4వ రోజు ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇవాళ మాలగం నుంచి మొదలైన భారత్‌ జోడో యాత్ర.. సాయంత్రానికి కేరళలోకి ప్రవేశించబోతోంది. త్రివేండ్రం దగ్గర్లోని చేరువరకోణం వద్ద ఆయనకు స్వాగతం పలికేందుకు క్యాడర్ భారీ ఏర్పాట్లు చేశారు. KPCC ప్రెసిడెంట్‌ సుధాకరన్‌ సహా ముఖ్యనేతలంతా రాహుల్‌తో కలిసి యాత్ర చేయబోతున్నారు. తిరువనంతపురం నుంచి త్రిసూర్ వరకూ 7 జిల్లాల మీదుగా ఈ పాదయాత్ర ఉంటుంది. ఈ యాత్ర సందర్భంగా పోలీసు బందోబస్తు భారీగా పెంచారు.

ఇవాళ రాహుల్ పాదయాత్రలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. కర్రసాము చేసే ఓ వ్యక్తి రాహుల్‌ని కలవడానికి ప్రయత్నించాడు. ఐతే.. సెక్యూరిటీ వాళ్లు అడ్డుకున్నారు. ఇది గమనించిన రాహుల్ అతన్ని దగ్గరకు పిలిచారు. దీంతో.. అతను తన కళను ప్రదర్శించారు. అద్భుతమని మెచ్చుకుంటూ వందనం చేశారు. రాహుల్‌గాంధీ యాత్రకు దారిపొడవునా మంచి స్పందన వస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి