BDL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్‌

| Edited By: Shaik Madar Saheb

Mar 11, 2021 | 2:23 PM

BDL Recruitment 2021: ప్రతి రోజు ఏదో ఒక రంగంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ వెలువడుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు పలు సంస్థలు ఉద్యోగ.

BDL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్‌
Follow us on

BDL Recruitment 2021: ప్రతి రోజు ఏదో ఒక రంగంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ వెలువడుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు పలు సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. తాజాగా భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (BDL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రాజెక్టు ఆఫీసర్‌ విభాగంలోని ఖాళీలను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఉద్యోగ ఖాళీల వివరాలు..

ప్రాజెక్టు ఇంజనీర్‌ విభాగంలో 55 పోస్టులు, ప్రాజెక్టు ఆఫీసర్‌ విభాగంలో15 పోస్టులు ఉన్నాయి. ఇందులో ప్రాజెక్టు ఇంజనీర్ విభాగంలో 55 పోస్టులు, ప్రాజెక్ట్ ఆఫీసర్ విభాగంలో 15 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, బీఎస్సీ, ఎంబీఏ, పీజీడిప్లొమా కలిగిన అభ్యర్థులు అర్హులు. అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లకు మించకుండా ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

అలాగే ప్రాజెక్టు ఆఫీసర్ ఉద్యోగాలకు నెలకు రూ. 30 వేల నుంచి రూ. 33 వేల వరకు ఉంటుందని, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు నెలకు రూ.36 వేల నుంచి రూ.39 వేల వరకు వేతనం ఉంటుందని తెలిపింది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

అర్హత కలిగిన అభ్యర్థులు bdl-india.in వెబ్ సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే వారికి ఏవైనా సందేహాలుంటే hrcorp-careers@bdl-india.inకు ఈ మెయిల్ చేయాలని ప్రకటనలో సూచించారు.

ఇవి చదవండి: Andhra Pradesh Jobs: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. APPSC ద్వారా 8402 ఉద్యోగాల భర్తీకి మంత్రి ప్రకటన..

Andhra Bank: పాత ఆంధ్రా బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌.. కొత్త నిబంధనలు.. గుర్తించుకోవాల్సిన విషయాలు