AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covaxin vaccine: కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్‌పై కీలక ప్రకటన విడుదల చేసిన భారత్ బయోటెక్ సంస్థ..

Covaxin vaccine: మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. కొవాగ్జిన్ 81శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు..

Covaxin vaccine: కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్‌పై కీలక ప్రకటన విడుదల చేసిన భారత్ బయోటెక్ సంస్థ..
Shiva Prajapati
|

Updated on: Mar 03, 2021 | 6:17 PM

Share

Covaxin vaccine: మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. కొవాగ్జిన్ 81శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తెలిపింది. 25,800 మందిపై కొవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా, వారిపై టీకా సమర్థవంతంగా పని చేసిందని భారత్ బయోటెక్ సంస్థ పేర్కొంది. ఆ మేరకు సంస్థ బుధవారం నాడు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థకు సంబంధించిన కొవాగ్జిన్ టీకాను దేశ ప్రజలందరికీ అందిస్తున్న విషయం తెలిసిందే. రెండు దశల ట్రయల్స్‌కు సంబంధించి కొవాగ్జిన్ పనితీరు మెరుగ్గా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం.. భారత్ బయోటెక్ రూపొందించిన ఈ టీకాను అత్యవసర వినియోగం కింద వినియోగించవచ్చు అంటూ కేంద్ర వైద్యఆరోగ్యశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, అప్పటికి మూడో దశ ట్రయల్స్ ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు. దాంతో మూడో దశ ట్రయల్స్ ఫలితాలు రాకుండానే కేంద్ర ప్రభుత్వం ఈ టీకాకు అనుమతి ఇవ్వడం పట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. టీకా సమర్థతపై అనేక అనుమానాలు రేకెత్తించారు. ఫలితంగా కొవాగ్జిన్ టీకా సమర్థతపై అనుమానంతో చాలా మంది ఆ టీకాను వేసుకునేందుకు వెనుకడుగు వేశారు. ఇక తాజాగా మూడో దశ ట్రయల్స్ ఫలితాలు కూడా విడుదలవడంతో భారత్ బయోటెక్ సంస్థకు సంపూర్ణంగా లైన్ క్లియర్ అయినట్లైంది. టీకా ప్రభావం కూడా ఘననీయంగా ఉండటంతో.. కొవాగ్జిన్ వినియోగం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Also read:

hollywood actor will smith : పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తా అంటున్న హాలీవుడ్ స్టార్.. ఎందుకో కారణాలు తెలియజేసిన కండల వీరుడు..

సీపీఎంతోనే ప్రజల అజెండా అమలు.. విజయవాడను అభివృద్ధి చేసిన ఘనత సీపీఎం వామపక్ష పార్టీలదే -సీహెచ్‌ బాబూరావు

దర్శకధీరుడి చేతుల మీదుగా ‘ఆకాశవాణి’ టీజర్ విడుదల… రిలీజ్ డేట్‏ను ఫిక్స్ చేసిన చిత్రయూనిట్.. ఎప్పుడంటే..