Bharat Bandh Today: దేశవ్యాప్తంగా బుధవారం బంద్ కొనసాగుతోంది. వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కుల ప్రాతిపదికన జనాభా గణనను కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలని ఆలిండియా బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (బీఏఎంసీఈఎఫ్) డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు (మే 25) భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఉత్తరభారతదేశంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ బంద్ చేపడుతున్నారు. ఎక్కడ కూడా ప్రభావం కనిపించలేదు. ఈ మేరకు బహుజన్ ముక్తి పార్టీ (BMP) నేత జిల్లా అధ్యక్షుడు నీరజ్ ధీమాన్ మాట్లాడుతూ.. కేంద్రం కులాల ఆధారంగా ఓబీసీ జనాభా గణన చేపట్టకపోవడం, ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకపోవడం, ఎన్నికల్లో ఈవీఎంలను తొలగించాలని భారత్ బంద్ చేపడుతున్నట్లు ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తెలిపింది.
దీంతోపాటు రైతులకు కనీస మద్దతు ధర కల్పించేలా చట్టం, పాత పెన్షన్ విధానం అమలు చేయడం, NRC ,CAA, NPR ఉపసంహరణ, పంచాయతీ ఎన్నికలలో OBC రిజర్వేషన్లు అమలు చేయడం, కోవిడ్ వ్యాక్సిన్‌లపై బలవంతపు ఒత్తిడికి వ్యతిరేకంగా బంద్ చేపట్టనున్నట్లు ఫెడరేషన్ నేతలు పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..