ATM Robbery: గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఎం దోపిడీకి విఫలయత్నం.. అగ్నికి ఆహుతైన కరెన్సీ నోట్లు!

|

Dec 07, 2023 | 6:22 PM

ముంబైలోని ఓ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో ఇద్దరు దుండగులు చోరీకి పాల్పడ్డారు. అయితే వారు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో ఊహించని పరిణామం ఎదురయ్యింది. గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఎంను పగలగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో గ్యాస్‌ కట్టర్ నిప్పురవ్వలు ఏటీఎమ్‌లోని డబ్బుకు అంటుకున్నాయి. దీంతో అందులోని కరెన్సీ నోట్లలో చాలావరకు కాలి బూడిదైపోయాయి. ఈ ఘటనలో ఎన్ని రూపాయలు కాలిపోయాయన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటన బెంగళూరు..

ATM Robbery: గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఎం దోపిడీకి విఫలయత్నం.. అగ్నికి ఆహుతైన కరెన్సీ నోట్లు!
ATM Robbery
Follow us on

బెంగళూరు, డిసెంబర్‌ 7: ముంబైలోని ఓ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో ఇద్దరు దుండగులు చోరీకి పాల్పడ్డారు. అయితే వారు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో ఊహించని పరిణామం ఎదురయ్యింది. గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఎంను పగలగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో గ్యాస్‌ కట్టర్ నిప్పురవ్వలు ఏటీఎమ్‌లోని డబ్బుకు అంటుకున్నాయి. దీంతో అందులోని కరెన్సీ నోట్లలో చాలావరకు కాలి బూడిదైపోయాయి. ఈ ఘటనలో ఎన్ని రూపాయలు కాలిపోయాయన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటన బెంగళూరు శివారులో బుధవారం (డిసెంబర్ 6) వెలుగు చూసింది.

బెంగళూరు శివారులోని నేలమంగళ ప్రాంతంలో ముంబై బ్రాంచ్‌కు చెందిన ఓ ఏటీఎంలో బుధవారం (డిసెంబర్‌ 6) రాత్రి ఇద్దరు దుండగులు దోపిడీకి యత్నించారు. ఈ షాకింగ్‌ ఘటనలో దుండగులు గ్యాస్‌ కట్టర్‌తో దాన్ని పగలగొట్టేందుకు ప్రయత్నించారు. ముంబైలోని బ్యాంక్‌ బ్రాంచ్‌ అధికారులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గమనించి వెంటనే ఏటీఎం ఉన్న భవన యజమానికి సమాచారం అందించారు. వెంటనే భవన యజమని చోరీ జరుగుతోన్న ఏటీఎం దగ్గరకు చేరుకున్నారు. అయితే అప్పటికే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ క్రమంలో వారు తెచ్చుకున్న గ్యాస్‌ కట్టర్‌, సిలిండర్‌, ఇతర పరికరాలను అక్కడే వదిలి వెళ్లిపోయారు.

అనంతరం బ్యాంకు సిబ్బంది చోరీకి యత్నించిన ఏటీఎం వద్దకు చేరుకున్నారు. ఏటీఎంను తెరచి చూడగా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మిషన్‌లో నుంచి దట్టమైన పొగ బయటికి రావడం వారికి కనిపించింది. దీంతో హుటాహుటీనా నోట్ల కట్టలు బయటికి తీయగా అందులో ఉన్న లక్షల నోట్లలో చాలావరకు కాలి బూడిదైపోయి కనిపించాయి. ఏటీఎం మెషిన్‌లో దాదాపు రూ.7లక్షలు ఉన్నట్లు సమాచారం. సీసీ ఫుటేజీ ఆధారం ప్రకారం ఇద్దరు వ్యక్తులు ఈ చోరీకి యత్నించినట్లు తెలుస్తోంది. బెంగళూరు సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.