ఏదైనా పండుగలు వస్తే సెలవులు వస్తాయని విద్యార్థులు సంబరపడతారు. ఎన్ని పండగలు వచ్చినా.. ఒకట్రెండు రోజులు సెలవులు ఇస్తే చాలనుకుంటారు. తీవ్ర పని ఒత్తిడిలో సెలవు దొరికితే బాగున్ను అనుకుంటారు. ప్రభుత్వ సంస్థల్లో ఇలాంటి సెలవులు పరిమితమే. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. దసరా సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 11 రోజులపాటు సెలవులు ప్రకటించింది. ఈఏడాది దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వమించేందుకు అక్కడి ప్రభుత్వం రెడీ అయింది. అలాగే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గాదేవి మండపాల నిర్వహకులకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వరాల జల్లు కురిపించారు.
సెప్టెంబర్ 30వ తేదీ నుంచి అక్టోబరు 10వ తేదీ వరకు ప్రభుత్వ సెలవులు ప్రకటించారు. దుర్గాదేవి మండపాలకు ప్రభుత్వం ప్రతి ఏడాది ఇచ్చే నిధులను పెంచుతూ మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఒకో మండపానికి రూ.50వేలు ఇస్తుండగా.. నిర్వహణ ఖర్చు కింద ఇచ్చే నిధిని ఈఏడాది రూ.60వేలకు పెంచారు. దుర్గాదేవి మండపాలకు ఇచ్చే విద్యుత్తు రాయితీని 50 నుంచి 60శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పశ్చిమబెంగాల్ మొత్తం దాదాపు 40 వేలకు పైగా రిజిస్ట్రర్డ్ దుర్గా పూజ మండపాలు ఉన్నాయి. 11 రోజుల దసరా సెలవులతో కలిపి ఈఏడాది పశ్చిమబెంగాల్ లో ప్రభుత్వ ఉద్యోగులకు 22 రోజుల సెలవులు కానున్నాయి. గత ఏడాది దుర్గాపూజ సందర్భంగా అక్టోబర్ లో నవరాత్రి, ఇతర సెలవులు కలిపి ప్రభుత్వ ఉద్యోగులకు 16 రోజుల సెలవులు రాగా.. ఈఏడాది ఆసెలవుల సంఖ్య 22కు చేరనున్నాయి. పశ్చిమబెంగాల్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..