Jaishankar: ఎవరైనా సరే భారత చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందే.. ‘బీబీసీ’ ఇష్యూపై స్పందించిన కేంద్రమంత్రి జైశంకర్

|

Mar 02, 2023 | 8:14 AM

ఎవరైనా సరే భారత చట్టాలకు లోబడి చేయాలని బ్రిటన్‌ విదేశాంగశాఖ మంత్రి జేమ్స్‌ క్లెవరీకి స్పష్టం చేశారు భారత విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌ . బీబీసీలో ఐటీ సర్వేపై క్లెవరీ అడిగిన ప్రశ్నకు జయశంకర్‌ ఈవిధంగా సమాధానమిచ్చారు.

Jaishankar: ఎవరైనా సరే భారత చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందే.. ‘బీబీసీ’ ఇష్యూపై స్పందించిన కేంద్రమంత్రి జైశంకర్
Jaishankar
Follow us on

బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సర్వే వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. జీ-20 విదేశాంగశాఖ మంత్రుల సమావేశం సందర్భంగా ఢిల్లీలో ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు బ్రిటన్‌ విదేశాంగశాఖ మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ. ఐటీ సర్వేపై విషయాన్ని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌తో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన జైశంకర్ భారత చట్టాలకు బీబీసీ కట్టుబడి ఉండాలని బ్రిటన్‌ విదేశాంగశాఖ మంత్రికి స్పష్టంచేశారు.

పన్ను ఎగవేత, యాడ్స్‌పై ఆదాయాన్ని చూపించలేదన్న కారణాలతో కొద్దిరోజుల క్రితం ఢిల్లీతో పాటు ముంబై లోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ సర్వే చేసింది. అయితే గుజరాత్‌ అల్లర్లపై ప్రధాని మోదీకి సంబంధించిన డాక్యుమెంటరీని ప్రసారం చేసిన్నందుకే బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు చేశారని కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు ఆరోపించాయి.

ఇవి కూడా చదవండి

అయితే, బీబీసీ కార్యాలయాల్లో సోదాలపై బ్రిటన్‌ ప్రభుత్వం స్పందించింది. పత్రికా స్వేచ్చకు తాము కట్టుబడి ఉన్నామని, బీబీసీకి ఈవిషయంలో తమ మద్దతు ఉంటుందని తెలిపింది. తమ ప్రభుత్వంపై కూడా బీబీసీ విమర్శలు చేస్తుందన్న విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలిపింది. తాజాగా ఇదేవిషయంపై జయశంకర్‌తో మాట్లాడారు బ్రిటన్‌ విదేశాంగమంత్రి జేమ్స్‌ క్లెవర్లీ. బీబీసీతో సహా ఎవరైనా భారత చట్టాలకు లోబడి పనిచేయాల్సిందే అని ఆయనతో స్పష్టం చేశారు జయశంకర్‌.

భారత్‌ తమకు మిత్రదేశమని బ్రిటన్‌ విదేశాంగశాఖ స్పష్టం చేసింది. బీబీసీ కార్యాయాల్లో ఐటీ సోదాలపై తమకు కొన్ని సందేహాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసుకోవడానికే జయశంకర్‌తో ఈవిషయాన్ని ప్రస్తావించినట్టు జేమ్స్‌ క్లెవర్లీ దీనిపై వివరణ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..