PM Modi: రెండు దేశాల మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు.. భారత్‌కు బంగ్లాదేశ్ అతిపెద్ద అభివృద్ధి భాగస్వామి అంటూ ప్రధాని మోదీ ప్రకటన
Sheikh Hasina India Visit : ఐటీ, అంతరిక్షం, అణుశక్తి వంటి రంగాల్లో సహకారాన్ని పెంచుకోవాలని ఇరు దేశాలు ఎంఓయూ కుదిరింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నాలుగు రోజుల భారత్ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీలో..
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఐటీ, అంతరిక్షం, అణుశక్తి వంటి రంగాల్లో సహకారాన్ని పెంచుకోవాలని ఇరు దేశాలు ఎంఓయూ కుదిరింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నాలుగు రోజుల భారత్ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు బంగ్లాదేశ్ భారతదేశం అతిపెద్ద అభివృద్ధి భాగస్వామి, ఈ ప్రాంతంలో మా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని ప్రధాని మోదీ అంటూ స్పష్టం చేశారు.
అంతరిక్షం, అణుశక్తి వంటి రంగాలపై ఒప్పందాలు
ఐటీ, అంతరిక్షం, అణు ఇంధనం వంటి రంగాల్లో సహకారాన్ని కూడా పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గత ఏడాది బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం 50 వ వార్షికోత్సవం, మా దౌత్య సంబంధాల స్వర్ణోత్సవాలు, షేక్ ముజిబుర్ రెహ్మాన్ జన్మ శతాబ్దిని కలిసి జరుపుకున్నాము. రాబోయే 25 సంవత్సరాల అమృత్ కాల్, బార్-బంగ్లాదేశ్ స్నేహం కొత్త శిఖరాలను తాకుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. కుషియారా నది నుంచి నీటిని పంచుకోవడంపై కూడా రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగింది. ఇది భారతదేశంలోని దక్షిణ అస్సాం, బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ ప్రాంతానికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు గుండా 54 నదులు ఉన్నాయి. శతాబ్దాలుగా రెండు దేశాల ప్రజల జీవనోపాధికి ఈ నదులు అనుసంధానించబడి ఉన్నాయి. ఈ నదులు వాటి గురించిన జానపద కథలు, జానపద పాటలు, మన ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి సాక్ష్యంగా కొనసాగుతున్నాయి.
అంతకు ముందు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మాట్లాడుతూ.. స్నేహం ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలదని.. భారత్‌తో తమది అలాంటి మైత్రేనని అన్నారు. పేదరిక నిర్మూలన,ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిపై భారత్-బంగ్లాదేశ్‌లు కలిసి పనిచేస్తున్నాయని ఆమె తెలిపారు. భారత పర్యటనలో ద్వైపాక్షిక చర్చలు ఫలవంతంగా సాగుతున్నాయని హసీనా వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం